Visakhapatnam Railway Zone: దశబ్ధాల ఎదురుచూపులు.. ఉత్తరాంధ్ర ప్రజల కల.. విశాఖ రైల్వే జోన్..! ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నిర్మాణ పనులు మొదలయ్యాయి. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని కూడా నియమించింది రైల్వేశాఖ. ఇంతకీ పనులు ఎలా జరుగుతున్నాయి. ? ముందుగా ఏయే నిర్మాణాలు చేపడుతున్నారు ? విశాఖ రైల్వే జోన్‌పై బిగ్‌టీవీ గ్రౌండ్ రిపోర్ట్.
రోజులు మారాయి..! ఏళ్లు గడిచాయి..! పార్టీలు మారాయి..! ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి..! కానీ విశాఖ రైల్వే జోన్ మాత్రం ముందుకు సాగలేదు. రైల్వే జోన్ కలగానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు వచ్చాయి. ఐతే రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మళ్లీ ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదపడంతో.. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జనవరి 8న విశాఖ వచ్చిన ప్రధాని మోడీ విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వెంటనే రైల్వేశాఖ నిధులు కేటాయించడం, కూటమి ప్రభుత్వం భూములు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. విశాఖ రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా సందీప్ మాతృకు బాధ్యతలు అప్పగించిన రైల్వేశాఖ.. రెండేళ్లలో 11 అంతస్తుల విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం చేపట్టాలని డెడ్‌లైన్ కూడా పెట్టింది. దాంతో కాంట్రాక్ట్ సంస్థ పనులను వేగవంతం చేసింది. 52.2 ఎకరాల్లో పనులు మొదలయ్యాయి. గత 40 రోజులుగా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో గ్రౌండ్ లెవెలింగ్‌తో పాటు మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయ్.
మరోవైపు.. రోడ్డు నిర్మాణాలపైనా దృష్టి పెట్టారు. B.R.T.S రోడ్డుకు కనెక్ట్ అయ్యేలాగా నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. B.R.T.S రోడ్డు నుండి విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి కేవలం 500 మీటర్లు దూరం మాత్రమే ఉంటుంది.
పనులు ఇదే స్పీడ్‌తో కొనసాగితే మరో ఏడాదిన్నరలో విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పూర్తవుతుందని భావిస్తున్నారు అధికారులు.
Also Read: టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బు వాపస్, వెంటనే ట్రై చేయండి!
కాగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ లతో పాటు వాల్తేరు డివిజన్ స్థానంలో.. కొత్తగా స్టార్ అయిన వైజాగ్ డివిజన్ కూడా వస్తుంది. వీటిలో విశాఖపట్నం డివిజన్ అతిచిన్నది కావడం విశేషం. ఈ నాలుగు డివిజన్లకు చెందిన వివిధ స్థాయిల అధికారులు కొత్త జోన్ ప్రధాన కేంద్రం విశాఖకు వస్తారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్ ప్రచురించాక.. అది ఏ తేదీ నుండి అమల్లోకి వస్తుందన్న దానిపై స్పష్టత రానుంది.
మొత్తం మీద చూస్తే.. జీవో నియామకం 5 నెలలు పట్టింది. మిగిలిన అధికారులు కీలక విభాగాలు వచ్చిన పాలన మొదలవడానికి.. ఎంత సమయం వస్తుందో చూడాలని అంటున్నారు. వీలైనంత వరకు వేగంగా పాలనను విశాఖ రైల్వే జోన్ కేంద్రంగా మొదలు పెట్టాలని అంతా కోరుతున్నారు.