BigTV English

Shreyas Iyer: ఎవడు మమ్మీ వీడు…. తల్లి బౌలింగ్ లోనే క్రికెట్ ఆడుతున్నాడు.. వీడియో చూస్తే దద్దరిల్లి పోవాల్సిందే

Shreyas Iyer: ఎవడు మమ్మీ వీడు…. తల్లి బౌలింగ్ లోనే క్రికెట్ ఆడుతున్నాడు.. వీడియో చూస్తే దద్దరిల్లి పోవాల్సిందే

Shreyas Iyer: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో తనదైన బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా జట్టును ఫైనల్ చేర్చి.. తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాడు. ఇలాంటి స్టార్ బ్యాటర్ తన ఇంట్లోనే స్వయానా తన తల్లి చేతిలో క్లీన్ బోల్డ్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..


Also Read: Yash Dayal: RCB దయాల్‌ ఇంత కామాంధుడా.. ఒక్కరు కాదు మరో ముగ్గురు అమ్మాయిల జీవితం నాశనం చేశాడు!

ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాకపోవడంతో శ్రేయస్ అయ్యర్ కి ప్రస్తుతం కాస్త విరామం లభించింది. ఈ సమయాన్ని శ్రేయస్ అయ్యర్ తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఉపయోగిస్తున్నాడు. ఇంట్లోనే తన తల్లితో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. తన ఇంట్లో తల్లి బౌలింగ్ చేస్తుండగా.. అయ్యర్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో ఆమె వేసిన ఓ బంతిని అంచనా వేయడంలో విఫలమై.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


ఇలా తల్లి వేసిన బంతిని మిస్ చేసిన వీడియోను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు మేనేజ్మెంట్ కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” మా సర్పంచ్ సాబ్ క్లీన్ బౌల్డ్ అయినా పరవాలేదు అనిపించే ఏకైక సందర్భం ఇదే” అని ఫన్నీగా కామెంట్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇక ఆగస్టు 17 నుండి బంగ్లాదేశ్ తో ప్రారంభం కాబోయే వైట్ బాల్ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా 2024 సెప్టెంబర్ నెలలో శ్రేయస్ అయ్యర్, అతడి తల్లి రోహిణి ముంబై లోని వర్లీ ప్రాంతంలో 2.9 కోట్ల విలువైన ఓ ఖరీదైన అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశారు. పోస్ట్ హౌసింగ్ సొసైటీలోని ఆదర్శనగర్ ప్రాంతం త్రివేణి ఇండస్ట్రియల్ రెండవ అంతస్తులో ఓ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశారు.

ఇప్పటికే అయ్యర్ లోధా వరల్డ్ టవర్స్ లో ఓ ఇంటిని కలిగి ఉన్నాడు. ఇది అత్యంత ఖరీదైన లివింగ్ సొసైటీలలో ఒకటి. అలాగే ముంబైలోని ఎత్తయిన భవనాలలో కూడా ఒకటి. ఈ ఆస్తి సెప్టెంబర్ 2020 నాటిది. ఇక బ్యాట్ తో మైదానంలో రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. ఆదాయంలోనూ గణనీయమైన ప్రోగ్రెస్ సాధించాడు. అతడి బ్రాండ్ వ్యాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయ్యర్ తో ఒప్పందాలకు ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయి.

Also Read: Bumrah – Sanjana: బయటపడ్డ బుమ్రా భాగోతం… ఆ అమ్మాయిని బాల్కనీలోకి లాక్కొని వెళ్లి

ఇప్పుడు అతడి దగ్గర విలువ రూ. 65 కోట్లు. ఐపీఎల్ కాంట్రాక్ట్ లు, లగ్జరీ పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ లతో ఈ సంపాదన వచ్చింది. 1994 డిసెంబర్ 6న ముంబైలో జన్మించిన అయ్యర్.. మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా రాణించగల బ్యాట్స్మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఇక 2021లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రంలోని సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి అధరహో అనిపించాడు. అతి తక్కువ సమయంలోనే అన్ని ఫార్మాట్లలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

Related News

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

WWE Ric Flair: 76 ఏళ్ల వయసులో ఇద్దరు లేడీలతో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు

Kohli – Anushka: లండన్ వీధుల్లో కోహ్లీ-అనుష్కకు షాక్… ఎవరు పట్టించుకోవడం లేదుగా !

Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?

Adam Hose: క్రికెట్ లోనే తొలిసారి.. గ్రౌండ్ లో భయంకరమైన గాయం.. కాలు విరిగి.. వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

Big Stories

×