BigTV English

Yash Dayal: RCB దయాల్‌ ఇంత కామాంధుడా.. ఒక్కరు కాదు మరో ముగ్గురు అమ్మాయిల జీవితం నాశనం చేశాడు!

Yash Dayal: RCB దయాల్‌ ఇంత కామాంధుడా.. ఒక్కరు కాదు మరో ముగ్గురు అమ్మాయిల జీవితం నాశనం చేశాడు!

Yash Dayal: క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించిన సంఘటన ఇది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} జట్టుకు ప్రతినిత్యం వహిస్తున్న క్రికెటర్ యష్ దయాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి యూపీ సీఎం పోర్టల్ లో దయాల్ పై ఫిర్యాదు చేసింది.


Also Read: Bumrah – Sanjana: బయటపడ్డ బుమ్రా భాగోతం… ఆ అమ్మాయిని బాల్కనీలోకి లాక్కొని వెళ్లి

ఫిర్యాదులో ఆ యువతీ తెలిపిన ప్రకారం.. ” క్రికెటర్ యష్ దయాళ్ తో ఐదేళ్లుగా సంబంధం ఉంది. అతడు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి శారీరకంగా, మానసికంగా వేధించాడు. అంతేకాకుండా నన్ను అతడి ఇంటికి తీసుకువెళ్లి.. కాబోయే కోడలు అంటూ వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అనూహ్యంగా దూరమయ్యాడు” అంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కొంతకాలానికి యష్ దయాల్ కి ఇతర యువతులతో సంబంధాలు ఉన్న విషయం తనకు తెలిసిందని.. దీని గురించి అతడిని ప్రశ్నిస్తే.. తనను మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది.


ఈ విషయంపై ఈనెల 14వ తేదీన మహిళ హెల్ప్ లైన్ లో ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఆ తర్వాత తనకి, దయాల్ కి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, స్క్రీన్ షాట్స్, వీడియో కాల్స్, ఫోటోలు వంటి ఆధారాలు సమర్పించానని తెలిపింది బాధితురాలు. వీటి ఆధారంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కానీ పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు దయాల్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు డిసిపి నిమిష్ పాటిల్.

యువతి ఫిర్యాదు పై దర్యాప్తు జరుగుతోందని, వాస్తవాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఈ యువతి మాత్రమే కాకుండా.. మరో ముగ్గురు మహిళలు కూడా ఈ క్రికెటర్ పై ఇలాంటి ఆరోపణలు చేయడంతో హాట్ టాపిక్ అవుతుంది. ఈ కేసులో ఆ యువతి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత దయాల్ కి నోటీసులు పంపారు పోలీసులు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన మహిళ మాట్లాడుతూ.. “అధికారం, డబ్బు, పరపతి ద్వారా ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Watch Video: క్రికెట్ లో కొత్త టెక్నిక్… రన్ ఔట్ కాకుండా కుట్రలు ఇలా కూడా చేయవచ్చు

నాకు భారత న్యాయవ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉంది. దయాల్ కుటుంబ సభ్యులు నాతో తప్పుగా ప్రవర్తించడంతో నేను చట్టాన్ని ఆశ్రయించాను. పెళ్లి పేరుతో నన్ను మోసం చేసినా.. అతడికి ఆ దేవుడే బుద్ధి చెబుతాడని వదిలేశాను. కానీ దయాల్ కుటుంబం నా గురించి తప్పుగా మాట్లాడింది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసింది. ఈ కారణంగానే నేను న్యాయపోరాటానికి దిగాను. ఈ నాలుగు సంవత్సరాలలో అతడు మరో ముగ్గురితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ ముగ్గురిలో ఒక యువతీతో నేను మాట్లాడి.. ఆమె దగ్గర నుండి ఆధారాలు కూడా సేకరించాను” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ కేసు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దయాల్ విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటపడతాయో వేచి చూడాలి.

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×