RJ Sekar Bhasha : ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఇష్యూ రాజ్ తరుణ్, లావణ్య కేసు.. తనని లైంగికంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకోమంటే మొహం చాటిస్తున్నాడంటూ లావణ్య అనే అమ్మాయి హీరో రాజ్ తరుణ్ పై పెట్టిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా ముందుకొచ్చాడు. అప్పటి నుంచి ఆయన పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా లావణ్య, శేఖర్ భాష డిబేట్ బాగా వైరల్ అయ్యింది.. అయితే గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో అమ్మాయిల గురించి సంచలన విషయాలను షేర్ చేశారు..
ఆడవాళ్ళ పై రెచ్చిపోయిన శేఖర్ బాషా..
శేఖర్ బాషా గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ మధ్య పలు ఛానెల్ ఇంటర్వ్యూలకు వెళ్తూ మగవాళ్లకు సపోర్టుగా నిలుస్తున్నాడు. మగవాళ్ళు ఎక్కువగా అన్యాయం అవుతున్నారని ఆయన గొంతు లేపారు. అంతేకాదు వారి కోసం పార్లమెంటులో ప్రత్యేక బిల్లును కూడా తీసుకురావాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే.ఇక అంతేకాదు పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి అని ఇక్కడ మొదలుపెట్టిన నినాదం ఏదైతే ఉందో అది ఢిల్లీ వరకు వెళ్లి వినిపించాము. ఢిల్లీలో దాదాపు 2000 మంది కార్యకర్తలు, 90 అర్జీలు.. పార్లమెంటులో ఇవ్వడం జరిగింది.. అయితే ఈ మధ్య ఈయన సైలెంట్ అయ్యాడు.. చాలా రోజుల తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆడవాళ్ల పై రెచ్చిపోయాడు. ఆడవాళ్లు కొన్ని ఆలోచించాలి కుటుంబాలను నాశనం చెయ్యకండి అంటూ విజ్ఞప్తి చేశాడు. ఒక మగాడు చెడిపోతున్నాడు అంటే దానికి ఆడవాళ్ళే కారణం.. మగవారికి న్యాయం జరగాలని ఢిల్లీలో పోరాటం చేశాను.. మళ్లీ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తానని శేఖర్ బాషా అంటున్నారు.
Also Read: ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. నితిన్ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు
అమ్మాయిలకు పేరెంట్స్ వీటిని నేర్పించాలి..
ఒక అమ్మాయి అబ్బాయిని ఈజీగా మోసం చేస్తుంది. కానీ అబ్బాయి అమ్మాయిని ఎక్కువగా పట్టించుకోడు. ఎంత బాధనైన భరిస్తాడు. అందుకే అమ్మాయిలకు తమ పేరెంట్స్ ముందు నుంచే కంట్రోల్లో పెట్టాలి అని అమ్మాయిల పై తన అక్కసును బయటకు కక్కేసాడు. తల్లి దండ్రులు అమ్మాయికి ఏదైన ధైర్యంగా ఉండేలా నేర్పించాలి.. అలాగే నిజాయితీ తప్పైన, రైట్ అయిన చెప్పే విధంగా పెంచాలి.. ఎవరిని మోసం చెయ్యకూడదని నేర్పించాలి. ఈ మూడు ప్రతి పేరెంట్స్ నేర్పిస్తే ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడరు.. ఈ మధ్య ఎంతో మంది అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలని శేఖర్ బాషా అన్నారు. ప్రస్తుతం శేఖర్ బాషా ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.