BigTV English

Bumrah – Sanjana: బయటపడ్డ బుమ్రా భాగోతం… ఆ అమ్మాయిని బాల్కనీలోకి లాక్కొని వెళ్లి?

Bumrah – Sanjana: బయటపడ్డ బుమ్రా భాగోతం… ఆ అమ్మాయిని బాల్కనీలోకి లాక్కొని వెళ్లి?

Bumrah – Sanjana: జస్ప్రీత్ బుమ్రా.. కొత్తగా పరిచయం చేయనక్కర్లేని పేరు. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అదరగొడుతూ స్టార్ హోదా దక్కించుకున్నాడు బుమ్రా. ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ పేసర్ గా కొనసాగుతున్నాడు. అలాగే తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నాడు. బూమ్రా భార్య సంజన గణేశన్. ఈమె స్టార్ స్పోర్ట్స్ లో ప్రముఖ యాంకర్. సంజన గణేశన్ ని బూమ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.


Also Read: Watch Video: క్రికెట్ లో కొత్త టెక్నిక్… రన్ ఔట్ కాకుండా కుట్రలు ఇలా కూడా చేయవచ్చు

పెళ్లి తర్వాత.. వీరి ప్రేమ, పెళ్లి విషయాల గురించి పెద్దగా మాట్లాడని ఈ జంట.. ప్రేమించుకున్న కొత్తలో జరిగిన కొన్ని విశేషాలను తాజాగా పంచుకున్నారు. 2013 లో ఐపీఎల్ సందర్భంగా వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సీజన్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించి తొలి టైటిల్ ని కైవసం చేసుకుంది. ఆ సమయంలో ముంబై జట్టు విజయం సాధించిన అనంతరం జట్టు ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసింది సంజన.


ఈ క్రమంలో మొదటిసారి బుమ్రాని చూడడంతో పాటు అతడితో మాట్లాడింది. ఈ పరిచయంతో బుమ్రా – సంజన ల మధ్య స్నేహం అప్పటినుండే మొదలైంది. ఇక 2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఈ ఇద్దరి స్నేహం మరో ముందడుగు వేసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. అయితే తాజాగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నిర్వహించే “హుజ్ ది బాస్” షో లో పాల్గొన్నారు బుమ్రా – సంజన. ఈ సందర్భంగా వారి లవ్ ప్రపోజల్ ను గుర్తు చేసుకున్నారు.

ఈ షో లో బుమ్రా మాట్లాడుతూ.. ” అది కోవిడ్ సమయం. అప్పుడు ప్రతి జట్టుకు బబుల్స్ పెట్టారు. ఆ సీజన్ లో సంజన కేకేఆర్ జట్టుతో ఉంది. నేను ముంబై ఇండియన్స్ లో ఉన్నాను. రెండు జట్లు అబుదాబిలో ఉన్నాయి. ఆ సమయంలో సంజనకి ప్రపోజ్ చేసేందుకు రింగ్ తీసుకున్న. కానీ బబుల్ వల్ల మేము కలవలేకపోయాం. ఆ తర్వాత నిర్వాహకులను ఒప్పించి సంజనని నా బబుల్ లోకి తీసుకువచ్చాను. ఆమెకు ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో కేక్ తీసుకువచ్చి.. నా గది మొత్తాన్ని అందంగా అలంకరించాను” అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

Also Read: RCB after IPL trophy: RCB కప్ గెలవడం ఏమో కానీ.. ఇన్ని దరిద్రాలు చుట్టుకున్నాయా

దీంతో సంజన మాట్లాడుతూ.. ” తన రూమ్ లోకి వెళ్ళగానే.. బాల్కనీలోకి పదా అంటూ తీసుకువెళ్లాడు. నేను దాహంగా ఉంది.. నీళ్లు ఇవ్వమని చెప్పినా వినకుండా బాల్కనీలోకి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో బుమ్రా టవల్ పై ఉన్నాడు” అని చెబుతూ నవ్వుల్లో మునిగిపోయింది సంజన. ఇక రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ.. 2021 మార్చి 15న వివాహం చేసుకున్నారు. సిక్కు సాంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. 2023 సెప్టెంబర్ 4న ఈ జంట కి ఓ కుమారుడు జన్మించాడు.

Related News

Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?

Adam Hose: క్రికెట్ లోనే తొలిసారి.. గ్రౌండ్ లో భయంకరమైన గాయం.. కాలు విరిగి.. వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

Asia Cup 2025: ఖతం, టాటా, బై బై… రిజ్వాన్, బాబర్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ప్రకటన..!

Jordan Cox: జోర్డాన్ కాక్స్ అరాచకం… ఒక్కో బంతికి 300… 10 సిక్సర్లు, 3 ఫోర్స్

CSK Biryani Restaurant : CSK అంటే మామూలుగా ఉండదు.. ధోని పేరుతో బిర్యానీలు

Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!

Big Stories

×