Kiran Abbavaram: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు మాత్రం అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడరు అనడంలో ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ మనకు కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా తమ వారసులను అభిమానులకు చూపించడానికి సెలబ్రిటీలు వెనకడుగు వేయడం ఇక్కడ ఆశ్చర్యకరమనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన(Upasana ) దంపతులకు పాప జన్మించింది. ఈ పాప రాకతో మెగా ఫ్యామిలీకి అదృష్టం కూడా వరించింది. అయితే ఈ పాపను చూడడానికి గత రెండేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నా.. ఇప్పటికీ ఈ దంపతులు తమ పాపను అభిమానులకు చూపించడం లేదు.
కిరణ్ అబ్బవరం కొడుకు కోసం అభిమానులు ఎదురుచూపు..
ఇప్పుడు ఈ జాబితాలోకి కిరణ్ అబ్బవరం (Kiran abbavaram), రహస్య ఘోరక్ (Rahasya ghorak) దంపతులు కూడా చేరిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే.. రాజావారు – రాణిగారు సినిమా సమయంలో షూటింగ్ సెట్లో ప్రేమలో పడ్డ ఈ జంట.. 2024లో వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మే 22న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది రహస్య. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని మురిసిపోయాడు కిరణ్ అబ్బవరం. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున తమ ఇంట్లోకి కొడుకు అడుగుపెట్టడం తమకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటూ తెలిపారు. ఇకపోతే కొడుకు పుట్టాడు కానీ తన కుమారుడి ఫోటోని మాత్రం ఈ జంట ఎవరికీ చూపించలేదు. దీంతో కిరణ్ అబ్బవరం కుమారుడు ఎలా ఉంటాడో చూద్దామని పరితపించిన వాళ్లకు నిరాశే మిగిలింది.
కిరణ్ అబ్బవరం కొడుకుని చూశారా? ఎంత క్యూట్ గా ఉన్నారో..
అయితే ఇదిలా ఉండగా.. తాజాగా కిరణ్ అబ్బవరం – రహస్య దంపతులు సోషల్ మీడియాలో ఒక క్యూట్ వీడియోని పంచుకున్నారు. ఇందులో తమ కుమారుడికి మొదటి ఫోటోషూట్ నిర్వహించారు ఈ జంట.. దీనినే ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. “ఇటీవల మా జీవితం ఇలా సాగుతోంది. నా కొడుకు మొదటి ఫోటోషూట్” అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు కిరణ్ అబ్బవరం. ఈ తల్లిదండ్రులు ఇద్దరు తమ కొడుకుతో గడిపిన మధుర క్షణాలు.. చూసేవారికి మరింత ఆనందాన్ని కలిగించాయి. ఇకపోతే ఈ వీడియోలో తమ కొడుకు ముఖం కనిపించకుండా స్మైలీ ఏమోజీ పెట్టి కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ చివర్లో కాస్త సైడ్ కి బాబు ముఖం రివీల్ అయింది. అందులో బాబు ఎర్రగా చబ్బీ చీక్స్ తో కనిపించాడు. ఇది చూసిన అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు . తమ హీరో కుమారుడు ఇంత అందంగా ఉండడం చూసి ఆనందంతో ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం – రహస్య ఘోరక్ దంపతుల కొడుకు వీడియో వైరల్ గా మారింది.
ALSO READ:Isha Koppikar: 14 ఏళ్ల ప్రేమ వివాహానికి స్వస్తి పలికిన నాగార్జున బ్యూటీ.. అసలేం జరిగిందంటే?
?utm_source=ig_web_copy_link