E-Paper
Advertisement

Shubman Gill Apartment: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటినే కొనేసిన‌ గిల్..ఎన్ని కోట్లంటే ?

Shubman Gill Apartment: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటినే కొనేసిన‌ గిల్..ఎన్ని కోట్లంటే ?
Advertisement

Shubman Gill Apartment:  టీమిండియా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాని నుంచి ఆ తర్వాత ఏకంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియాలోకి వచ్చిన తర్వాత కన్సిస్టెంట్ గా రాణించి ఇప్పుడు కెప్టెన్ గా ఎదిగాడు. టెస్టులు అలాగే వన్డేలకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు గిల్. అతి త్వరలోనే మూడు ఫార్మాట్స్ కు కూడా గిల్ కెప్టెన్ అవుతాడని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్ ( Luxury Apartment) కొనుగోలు చేశాడు. అదికూడా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) భర్త జాకీ భగ్నానీ ( Jackky Bhagnani ) దగ్గర నుంచి కొనుగోలు చేశారు. దాదాపు 20 కోట్లు పెట్టి ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడు గిల్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

రకుల్ ప్రీత్ సింగ్ ఇంటినే కొనేసిన‌ శుభమాన్ గిల్ !

Advertisement

టీమిండియా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill ) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్ కొన్నాడు. దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహులో ( Mumbai juhu) టీమ్ ఇండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు రూ.20.7 కోట్లు పెట్టి మరి ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు. 12వ ఫ్లోర్ లో 3369 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు. ఈ లగ్జరీ అపార్ట్మెంట్ స్టాంపు డ్యూటీకి రూ. 1.24 కోట్లు చెల్లించాడట శుభమాన్ గిల్. ఇక ఈ అపార్ట్మెంట్ ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ ( Jackky Bhagnani ) ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిర్మిస్తున్నారు. అంటే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ వాటా కూడా ఉందని స‌మాచారం. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ నిర్మించబోయే ఈ 12వ ఫ్లోర్ ను గిల్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ఈ బిల్డింగ్ 2029లో పూర్తి అవుతుంది.

సారా కోస‌మే గిల్ కొనుగోలు చేశాడంటూ వార్త‌లు ?

ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్ గిల్ కొనుగోలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ను త్వరలోనే గిల్ పెళ్లి చేసుకోబోతున్నాడని.. అందుకే ముందు జాగ్రత్తగా ముంబైలో అపార్ట్మెంట్ కొన్నాడని పోస్టులు పెడుతున్నారు జనాలు. 2029 సమయం వరకు వీళ్ళ పెళ్లి జరగబోతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed On PSL: ఛీ..ఛీ నిజంగా పాకిస్తాన్ బికారి దేశమే..కెప్టెన్స్‌ ప్రెస్ మీట్ ను పెళ్లి పందిరిగా మార్చారు క‌ద‌రా

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×