E-Paper
Advertisement

Luxury Train: రైల్లోనే రెస్టారెంట్, స్పా, బార్.. జస్ట్ రూ.500కే!

Luxury Train: రైల్లోనే రెస్టారెంట్, స్పా, బార్.. జస్ట్ రూ.500కే!
Advertisement

Most Affordable Luxury Train: రైలులో ప్రయాణం అంటే సాధారణంగా సీట్లు, కొద్దిగా సౌకర్యాలు ఉంటాయని చాలా మందికి తెలుసు. అత్యాధునిక రైళ్లలో కాస్త లగ్జరీ సౌకర్యాలు లభిస్తున్నాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో హోటల్, స్పా, బార్ కూడా ఉంటుంది. అయితే, ఈ రైలు ఇండియాలో కాకుండా జపాన్‌ లో నడుస్తుంది. ఇది ప్రయాణాన్ని పూర్తిగా లగ్జరీ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.  ఈ రైలు పేరు ఆనియోషి లిమిటెడ్ ఎక్స్‌ ప్రెస్. ఇందులో స్పా, రెస్టారెంట్, బార్ లాంటి సౌకర్యాలతో ఒక లగ్జరీ హోటల్‌ లా అనిపిస్తుంది.

వీడియో షేర్ చేసిన వ్లాగర్ విపన్‌దీప్ కౌర్

ఆనియోషి లిమిటెడ్ ఎక్స్‌ ప్రెస్ కు సంబంధించిన వీడియోను వ్లాగర్ విపన్‌దీప్ కౌర్ షేర్ చేసింది. రైలు లోపలి దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలు చూసిన వారికి ఇది నిజంగా రైలా? లేక ఓ లగ్జరీ హోటలా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. సీటింగ్ చాలా స్టైలిష్‌ గా ఉంది. జంటల కోసం ప్రత్యేకంగా రెండు సీట్లు ఒకదానికొకటి ఎదురుగా ఏర్పాటు చేశారు. పెద్ద కిటికీల ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది. సీట్లు మృదువుగా, సౌకర్యంగా ఉండి, ప్రయాణం అంతా రిలాక్స్‌ గా మార్చుతున్నాయి. ప్రతి సీటుకు పక్కన చిన్న టేబుల్ కూడా ఉంది. దాని మీద ఫుడ్, డ్రింక్స్ ఉంచుకుని తినే అవకాశం ఉంటుంది.

Advertisement

ప్రైవేట్ సూట్లు కూడా..

ఇక ఈ లగ్జరీ రైల్లో ప్రైవేట్ సూట్లు కూడా ఉన్నాయి. అందులో కూర్చునే కుర్చీలు లగ్జరీగా ఉండి, మధ్యలో టేబుల్ ఉంటుంది. చిన్న మీటింగ్స్, ఫ్యామిలీతో కంఫర్ట్‌ గా టైమ్ గడపడానికి బాగుంటుంది. సీట్ల మధ్య పార్టిషన్లు ఉండటంతో  ప్రైవసీ కూడా ఉంటుంది. ఈ రైలు జపాన్‌ లోని  ఒసాకా, నారా, క్యోటో నగరాలను కలుపుతుంది. కేవలం 40 నిమిషాల్లో ఈ ప్రయాణం పూర్తవుతుంది. చిన్న ప్రయాణమే అయినా, ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుంది.

రెస్టారెంట్, బార్, లైబ్రరీ, స్పా సౌకర్యాలు

Advertisement

ఈ రైలులో రెస్టారెంట్, బార్, లైబ్రరీ, సెలూన్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. బార్‌ లో ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్, డ్రింక్స్ అందిస్తారు. గిఫ్ట్ లు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. బాత్రూమ్ కూడా అత్యాధునికంగా, శుభ్రంగా ఉన్నాయి.

జస్ట్ రూ. 500లకే లగ్జరీ ప్రయాణం

ఇక ఈ రైలు ఇంత లగ్జరీ ఉన్నప్పటికీ, టికెట్ ధర కేవలం రూ. 500 కావడం విశేషం. తక్కువ ధరలో ఇంత మంచి ఎక్స్ పీరియెన్స్ అందించడం ఈ రైలు ప్రత్యేకత. ఈ రైలు సాధారణ ప్రయాణం కంటే ఎక్కువగా, లగ్జరీ అనుభవాన్ని ఇస్తుంది. హోటల్, రెస్టారెంట్, బార్ తో పాటు సకల సౌకర్యాలు ఉండే ఈ రైలు, ప్రయాణాన్ని మరింత ఆనందకరంగా మారుస్తుంది. ఇలాంటి రైళ్లు మనదేశంలో కూడా వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:  విమానాల్లో చేస్తున్నట్లే.. ఆ రైళ్లలో కూడా అది తప్పనిసరి చేయండి.. కోర్టు కీలక వ్యాఖ్యలు!

Related News

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

Big Stories

Advertisement
×