BigTV English

Mohammad Siraj: సిరాజ్ మామూలోడు కాదు.. మరో కొత్త అమ్మాయితో డేటింగ్..!

Mohammad Siraj: సిరాజ్ మామూలోడు కాదు.. మరో కొత్త అమ్మాయితో డేటింగ్..!

Mohammad Siraj: టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికే టీమ్ ఇండియాలో చోటు కోల్పోయి, అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనకి ఇష్టమైన ఆర్సిబి కి దూరమైన సిరాజ్ పై రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది. సిరాజ్ కొంత కాలంగా బాలీవుడ్ నటి మహీరా శర్మతో డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే విషయమై సిరాజ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీడియా ఇదే ప్రశ్న వేసింది.


Also Read: Natasa Stankovic: పాండ్యాకు షాక్… మరో కుర్రాడిని పట్టిన నటాషా ?

వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ఇద్దరూ కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయాన్నీ చెప్పేశారు. మహిరా శర్మ తను ఎటువంటి రిలేషన్ లో లేనని ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టగా.. దయచేసి ఫోటోగ్రాఫర్స్ అలాంటి ప్రశ్నలు అడగవద్దని, తన మీద జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇందులో నిజాలు లేవని సిరాజ్ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. ఇలా ఒకేరోజు ఇద్దరూ స్టోరీలు పెట్టడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది.


ఈ రూమర్స్ ని ఇక్కడితో ఆపేయాలని ఆశిస్తున్నట్లు సిరాజ్ తెలిపాడు. ఇలా వీరు వివరణ ఇచ్చి కనీసం నాలుగు రోజులకు కూడా గడపముందే సిరాజ్ ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు మరో రూమర్ వైరల్ అవుతుంది. సిరాజ్ కి ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఇంట్లో వారు కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి కూడా సాధారణ అమ్మాయి కాదు. వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న గ్లామర్ గర్ల్.

ఆమె ఎవరో కాదు లిబియాకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హనీన్ హమందోష్. ఈమె దుబాయిలో నివసిస్తోంది. ఈమెకి సోషల్ మీడియాలో 6 లక్షల 50 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా మహమ్మద్ సిరాజ్ ఈ అమ్మాయి ఫోటోకి ఇంస్టాగ్రామ్ లో లైక్ కొట్టాడు. కాగా సాధారణంగా క్రికెటర్లు ఏ చిన్న పనిచేసినా పది హైలెట్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ ఆ అమ్మాయి ఫోటోకు లైక్ చేయడం కూడా వైరల్ గా మారింది.

Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్… టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !

ఇలా కొద్ది నెలలుగా మహమ్మద్ సిరాజ్ డేటింగ్ రూమర్స్ గురించి సోషల్ మీడియాలో తరచూ వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ రూమర్స్ వ్యాప్తి చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఈ రూమర్స్ కి చెక్ పెట్టాలంటే ఓ ఇంటివాడు కావాల్సిందేనని సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ ఐపిఎల్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 18 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కి ఆడుతున్నాడు సిరాజ్.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×