Robin hood:సాధారణంగా ఒక సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవాలి అంటే.. అందులో అభ్యంతరకర సన్నివేశాలు పూర్తిగా తొలగిస్తేనే ఆ సినిమాను బట్టి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తుంది. ముఖ్యంగా ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉంటే మాత్రం వెంటనే తొలగించమని యూనిట్తో చెబుతుంది. ఈ నేపథ్యంలోనే శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఎంతో కష్టపడి ‘రాబిన్ హుడ్’ సినిమాలోని “అది దా సర్ప్రైజ్” అనే స్పెషల్ పాటలో ప్రముఖ హీరోయిన్ కేతిక శర్మ (Kethika Sharma) చేత హుక్ స్టెప్ వేయించి, పాపులర్ అవుదామని అనుకున్నారట. కానీ ఆయన కష్టం మొదట్లోనే వృథా అయిపోయింది.. నితిన్(Nithin ), శ్రీ లీలా (Sree Leela) కాంబినేషన్లో వస్తున్న ఈ రాబిన్ హుడ్ సినిమాలో కేతికాశర్మ స్పెషల్ సాంగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సాంగ్ విడుదలైనప్పుడు కేతికాశర్మ హుక్ స్టెప్ కాస్త అభ్యంతరకరంగా అనిపించింది. దీంతో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై చాలా విమర్శలు వచ్చాయి.
శేఖర్ మాస్టర్ కి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..
అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కి షాక్ ఇస్తూ సెన్సార్ బోర్డు ఇచ్చిన సలహా ఆయన కష్టాన్ని వృథా చేసినట్టు అనిపించింది. అసలు విషయంలోకి వెళ్తే.. రాబిన్ హుడ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడానికి వెళ్ళగా.. అక్కడ “అది దా సర్ప్రైజ్ ” సాంగ్ లోని కేతికా శర్మ హుక్ స్టెప్ పై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే కరెక్షన్ చేయమని కూడా సలహా ఇచ్చింది. మొత్తానికైతే ఈ మూవీలో ఆ హుక్ స్టెప్ అలా ఉండొద్దని చెప్పడంతో. కాస్త మార్చాము అంటూ ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula) కూడా క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా హుక్ స్టెప్ పై భారీ అంచనాలు పెట్టుకున్న శేఖర్ మాస్టర్ కి సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.
రాబిన్ హుడ్ సినిమా టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ క్లారిటీ..
ఇక రాబిన్ హుడ్ సినిమా విశేషాలకొస్తే.. ఒకప్పుడు నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ లో నితిన్ కి సక్సెస్ పడలేదు. దాంతో ఈ కాంబో రిపీట్ కాబోతోంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తో పాటు డేవిడ్ వార్నర్ (Devid Warner) కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా టికెట్ ధరల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ కూడా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే జిఎస్టితో కలిపి సింగిల్ స్క్రీన్ లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. విడుదలైన రోజు నుంచి ఏడు రోజులు మాత్రమే ఈ టికెట్ ధరలు అమలులో వుంటాయని మైత్రి మూవీ మేకర్ క్లారిటీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా నితిన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Naga Vamshi : మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫిక్స్ చేసిన నాగ వంశీ.. డైరెక్టర్ నెల్సన్… మరి హీరో..?