Most Ducks In IPL: ఆస్ట్రేలియా ఆటగాడు గ్లేన్ మాక్స్ వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఈ 18వ సీజన్ లో మ్యాక్స్వెల్ విధ్వంసం సృష్టిస్తాడు అనుకుంటే తొలి మ్యాచ్ లోనే తుస్సుమన్నాడు. కేవలం ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. గత కొన్ని సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు {ఆర్సిబి} తరఫున మెరుపులు మెరూపించిన ఈ ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్.. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లోనే తేలిపోయాడు.
Also Read: Shashank Singh: పంజాబ్ లో నిజమైన కాటేరమ్మ కొడుకు..!
ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగిన ఈ ప్లేయర్.. ఐపీఎల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ లో ఎన్నోసార్లు అతడు ప్రాతినిధ్యం వహించిన జట్లను గెలిపించిన ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్.. ఈ లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ {Most Ducks In IPL} అయిన ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం రోజు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్వెల్ {0} ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
తద్వారా ఐపిఎల్ లో అత్యధిక సార్లు {19} డకౌట్ ఆయన ఆటగాడిగా తన పేరిట చెత్త రికార్డుని నమోదు చేసుకున్నాడు. మంగళవారం రోజు జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ విద్వాంసకర బ్యాటింగ్ తో చెలరేగగా.. తన సహచరుడు మ్యాక్స్వెల్ కి మాత్రం విలన్ గా మారాడు. శ్రేయస్ అయ్యర్ కారణంగా మాక్స్వెల్ ఐపీఎల్ లో అత్యధిక డకౌట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ కి రాగానే అతడిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు.
కానీ సాయి సుదర్శన్ మొదటి బంతికే మాక్స్వెల్ ని అవుట్ చేశాడు. రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించాడు మ్యాక్స్వెల్. కానీ ఆ బంతి బ్యాట్ కి బదులుగా ప్యాడ్ ని తాకింది. దీంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఆ తర్వాత మ్యాక్స్.. శ్రేయస్ అయ్యర్ నుండి సమీక్ష తీసుకోవడానికి సలహా కోరగా.. అతడు దానికి నో చెప్పాడు. ఈ కారణంగా అతడు రివ్యూ తీసుకోకపోవడంతో అవుట్ గా క్రీజ్ పదిలాడు. కానీ ఆ తర్వాత రిప్లై లో బంతి స్టంప్స్ ని తాకలేదు.
Also Read: Shashank Singh: శ్రేయస్ తన సెంచరీని కావాలనే వదులుకున్నాడు
బంతి బౌన్స్ గా వెళ్లడంతో మ్యాక్స్ నాటౌట్ అని వెళ్లడైంది. అయితే సమీక్ష తీసుకోకుండానే పెవిలియన్ చేరాడు మ్యాక్స్. తద్వారా ఐపిఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ రికార్డు ఇప్పటివరకు టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ {18}, దినేష్ కార్తీక్ {18}, మాక్స్వెల్ {18}, పీయూష్ చావ్లా {16}, సునీల్ నరైన్ {16} గా ఉండేది. అయితే మంగళవారం రోజు మ్యాక్స్ డకౌట్ {19} సార్లు కావడంతో మొదటి స్థానానికి చేరుకున్నాడు.