BigTV English

Natasa Stankovic: పాండ్యాకు షాక్… మరో కుర్రాడిని పట్టిన నటాషా ?

Natasa Stankovic: పాండ్యాకు షాక్… మరో కుర్రాడిని పట్టిన నటాషా ?

Natasa Stankovic: గతేడాది భారత ఆల్ రౌండ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుండి విడాకులు తీసుకొని ప్రముఖ నటి నటాషా స్టాంకోవిక్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాల వీరి దాంపత్య బంధానికి పుల్ స్టాప్ పడింది. వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. హార్దిక్ పాండ్యాతో బ్రేకప్ అనంతరం కుమారుడు అగస్త్యతో కలిసి స్వదేశం వెళ్లిపోయిన ఆమె.. తిరిగి భారత్ వచ్చేసింది. హార్దిక్ పాండ్యాతో ఆమె 2024 జూలైలో విడిపోయింది.


Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్…టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !

ఆ తర్వాత ఇటీవల మళ్లీ భారత్ కి తిరిగి వచ్చి మార్చ్ 4న తన 33వ పుట్టినరోజును జరుపుకుంది. అప్పటినుండి ఇంస్టాగ్రామ్ లో వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే హార్దిక్ పాండ్యా బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా తో డే** చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక నటాషా కూడా మళ్లీ ప్రేమలో పడడానికి సిద్ధంగా ఉన్నానంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ కు హాజరైన ఆమె.. తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


ఆ ఇంటర్వ్యూలో నటాషా మాట్లాడుతూ.. ” నేను నా అనుభవాల ద్వారా ఎదుగుతున్నాను. ఇక ఇప్పుడు జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మళ్ళీ ప్రేమలో పడడానికి నాకు అభ్యంతరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు నాకు సరైన వ్యక్తి దొరుకుతాడు. నమ్మకం, పరస్పర అవగాహనపై నిర్మితమైన, అర్థవంతమైన సంబంధాలను నేను విలువైనవిగా భావిస్తాను. ప్రేమ నా ప్రయాణానికి తోడుగా ఉండాలని నేను భావిస్తున్నాను.

జీవితం ఏం అందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా మళ్లీ యాక్టింగ్ లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈమధ్య ఆమె తన స్నేహితుడు, ఫిట్నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇలిక్ తో పబ్లిక్ గా మీడియాకు కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందన్న ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇంటర్వ్యూలో మళ్ళీ ప్రేమలో పడ్డారా..? కానీ ప్రశ్నకు ఈ విధంగా స్పందించింది.

ఇక హార్దిక్ పాండ్యా తో ప్రేమలో పడిన నటాషా.. అతడిని 2020లో పెళ్లి చేసుకుంది. అదే ఏడాది జూలైలో ఆగస్త్య అనే కుమారుడికి జన్మనిచ్చింది ఈ జంట. ఇక నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత ఈ జంట విడిపోయింది. అయితే గత సంవత్సరం తనకు చాలా కష్టంగా గడిచిందని, పాండ్యాతో విడాకుల విషయం తనను బాధించిందని తెలిపింది. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటేనే మనం రాటుదేలుతామని.. మనుషులు వయసుతో కాకుండా అనుభవాలతోనే పరిణితి చెందుతారని పేర్కొంది.

ప్రస్తుతం తన జీవితంపై దృష్టి సారిస్తున్నానని, సినిమాలు మానేసి ఐదు సంవత్సరాలు అవుతున్నందున.. సుదీర్ఘ విరామం అనంతరం సినీ పరిశ్రమలో పునరాగమనం అంత సులువైన పని కాదని పేర్కొంది. కొత్త నైపుణ్యాలను అలవర్చుకునే లక్షణాలు ఉన్న తనకి కెరీర్ ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×