Sitanshu Kotak On Ishan Kishan Inury: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆడితే చూడాలని ఎంతో మంది అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో న్యూజిలాండ్ తో జరిగే రెండో టి20లో వైభవ్ సూర్యవంశీ బరిలో దిగే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ కు గాయం అయిందని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గాయం తీవ్రమైతే ఇషాన్ కిషన్ స్థానంలో వైభవ్ ను బరిలోకి దింపాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ సూర్యవంశీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య గురువారం తొలి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ మూడవ స్థానంలో రావడం… ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ చేసిన ఈ ప్రయోగంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇలాంటి నేపథ్యంలో తిలక్ వర్మను మూడవ స్థానంలో పంపడంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చారు. ఇషాన్ కిషన్ కు గ్రోయిన్ గాయం అయిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడి అనుమతితోనే తిలక్ వర్మను మూడవ స్థానంలో పంపినట్టు వెల్లడించారు. అంతేకానీ టీమ్ ఇండియాలో బలవంతమైన నిర్ణయాలు రుద్దడం జరగదని సోషల్ మీడియా వార్తలకు కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా గౌతమ్ గంభీర్ పై దుమ్మెత్తి పోస్తున్నానని సితాన్షు కోటక్ ఫైర్ అయ్యారు.
మొదటి టి20 సందర్భంగా గాయపడ్డ ఇషాన్ కిషన్ స్థానంలో బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని తీసుకుని అవకాశాలు ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. ఒకవేళ ఇషాన్ కిషన్ కోలుకుంటే వైభవ్ మళ్లీ రిజర్వు బెంచ్ కు పరిమితమవుతాడని తెలిపారు. ఇషాన్ కిషన్ గాయం తీవ్రమైతే మాత్రం వైభవ్ ను ఓపెనర్ గా దించే ఆలోచన ఉందని పేర్కొన్నాడు. అప్పుడు సంజు ఫస్ట్ డౌన్ ల ఓ దిగే ఛాన్స్ ఉందని స్పష్టం చేశాడు. ఇది ఇలా ఉండగా తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా 225 పరుగులు చేసింది న్యూజిలాండ్. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆచితూచి ఆడిన టీమిండియా 19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. సంజు అర్థ సెంచరీతో దుమ్ము లేపగా నమన్ ధీర్ సూపర్ స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు. ఈ దెబ్బకు నాలుగు వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ అందుకుంది.