E-Paper
Advertisement

Ind vs SA 3rd T20I: హ‌ర్షిత్ రాణా మజాకా, కుప్ప‌కూలిన ద‌క్షిణాఫ్రికా..టీమిండియా టార్గెట్ ఎంతంటే

Ind vs SA 3rd T20I: హ‌ర్షిత్ రాణా మజాకా, కుప్ప‌కూలిన ద‌క్షిణాఫ్రికా..టీమిండియా టార్గెట్ ఎంతంటే
Advertisement

Ind vs SA 3rd T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ ధర్మశాల వేదికగా మూడో టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా కు బాగా అచ్చి వచ్చింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లు ముగిసే సమయానికి 117 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ సేనకు పిచ్ పరిస్థితులు బాగా కలిసి వచ్చాయి. టీమిండియా బౌలర్లు అందరూ అదరగొట్టారు. హర్షిత్ రాణా, అర్ష‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఇలా అందరూ బౌలర్లు రాణించారు. ఈ దెబ్బకు సౌత్ ఆఫ్రికా 117 పరుగులకే కావాల్సి వచ్చింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు సాధిస్తే టీమిండియా విక్టరీ కొట్టడం ఖాయం. మరి మనోళ్లు ఎలా ఆడతారో చూడాలి.

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

కుప్ప‌కూలిన ద‌క్షిణాఫ్రికా..టీమిండియా టార్గెట్ ఎంతంటే

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ ధర్మశాల వేదికగా జ‌రిగిన మూడో టి20 మ్యాచ్ లో మొద‌ట ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ త‌రుణంలో మొద‌టి నుంచి పరుగులు చేసేందుకు స‌ఫారీలు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌నోళ్ల బంతుల‌కు క‌కావిక‌లం అయ్యారు. ఈ త‌రుణంలోనే వరుస‌గా వికెట్లు కోల్పోయింది స‌ఫారీ జ‌ట్టు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మిన‌హా, ఏ ఒక్క బ్యాట‌ర్ రాణించ‌లేదు. క్రీజులో నిల‌వ‌లేదు. ఐడెన్ మార్క్రామ్ ఒక్క‌డే 46 బంతుల్లో 61 ప‌రుగులు సాధించాడు. అటు డోనోవన్ ఫెర్రీరా 20 ప‌రుగులు చేసి, రాణించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ సెట్ కాలేదు. దీంతో 117 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది స‌ఫారీ జ‌ట్టు. అటు టీమిండియా బౌల‌ర్ల‌లో అంద‌రికీ వికెట్లు ప‌డ్డాయి. హర్షిత్ రాణా 2 వికెట్లు, అర్ష‌దీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అటు హార్దిక్ పాండ్యా, శివం దూబేకు చెరో వికెట్ ప‌డింది.

హ‌ర్షిత్ రాణా మజాకా, గంభీర్ కు ఊపు తెప్పించాడుగా

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ ధర్మశాల వేదికగా జ‌రిగిన మూడో టి20 మ్యాచ్ లో కోచ్ గంభీర్ శిష్యుడుగా పేరుగాంచిన హ‌ర్షిత్ రాణా రీ-ఎంట్రీలో అద‌ర‌గొట్టాడు. విమ‌ర్శ‌కుల‌కు నోటికి తాళం వేస్తూ, అద‌రిపోయే ఆట‌తీరును క‌న‌బ‌రిచాడు హ‌ర్షిత్ రాణా ( Harish Rana). బుమ్రా లాంటి ప్లేయ‌ర్ స్థానంలో వ‌చ్చిన హ‌ర్షిత్ రాణా, ఇవాళ్టి మ్యాచ్ లో 4 ఓవ‌ర్లు వేశాడు. ఈ సంద‌ర్భంగా 34 ప‌రుగులు ఇచ్చి, ఏకంగా 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. డేంజ‌ర్ ప్లేయ‌ర్ డికాక్‌, బ్రేవిస్ లాంటి రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. హ‌ర్షిత్ ఆట‌తీరుతో గంభీర్ హుషారుగా క‌నిపించాడు. కాగా ఛేజింగ్ లో గిల్ ఎలా ఆడ‌తాడ‌ని అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.

Advertisement

 

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×