Naman Dhir Vs Hardik Pandya: టీమిండియాలోకి ఇటీవల వచ్చిన ఆల్ రౌండర్ నమన్ ధీర్ అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన నమన్ ధీర్… కిందటి ఏడాది అద్భుతంగా రాణించడంతో టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ ఇరగదీస్తున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా స్థానాన్ని నమన్ ధీర్ భర్తీ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. మోకాలి గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా స్థానంలో అన్ని ఫార్మాట్స్ లో కొనసాగించాల్సిందేనని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా అతడిని తీసుకుంటే బెటర్ అంటూ కొంతమంది బీసీసీఐకి ఇప్పటికే సూచనలు చేస్తున్నారట. హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టి మరీ నమన్ ధీర్ కు ఓటేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, బీసీసీఐపై ఇలా ఒత్తిడి తీసుకువచ్చేది ముంబై ఇండియన్స్ అని ప్రచారం సాగుతోంది. పాండ్యాకు టీమిండియా అవకాశాలు ఇవ్వకుండా చేసేందుకు ఈ కుట్రలు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ముంబై యాజమాన్యంపై హార్ధిక్ పాండ్యా ఎదురు తిరగినట్టు చెబుతున్నారు. ఈ తరుణంలోనే అతనిపై ముంబై పగ తీర్చుకుంటున్నట్టు చెబుతున్నారు. అందుకే ముంబైకి ఆడిన నమన్ ధీర్ ను తమ పలుకుబడితో టీమిండియాలోకి దించారని అంటున్నారు. ఈ విషయం ముందే గ్రహించిన పాండ్యా, ముంబైని వీడి మరో ఫ్రాంచైజీకి ఆడాలని డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది మేలో మోకాలి గాయంతో టీమ్ ఇండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా రికవరీకి మరింత సమయం పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. అతడు నేరుగా ఐపిఎల్ 2027 లోనే ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.
ప్రస్తుతం బెంగళూరులోని ఎక్సలెన్సీ లో హార్థిక్ పాండ్యా ఉన్నాడు. మూడు వారాల్లో జాగింగ్, ఎనిమిది వారాల తర్వాత రన్నింగ్ చేస్తారని నివేదికను చెబుతున్నాయి. ఆ తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు మరింత టైం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ లో శ్రీలంకతో జరిగే వన్డేలు టీ20లకు దూరం కానున్నాడు. అంటే నేరుగా ఐపిఎల్ 2027 టోర్నమెంట్ లోనే పాండ్యా రీ-ఎంట్రీ ఉంటుందని ప్రచారం మొదలైంది. దీంతో హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీమిండియాకు హార్దిక్ పాండ్యా పనికిరాడని… కేవలం ఐపీఎల్ ఆరాటపడుతున్నాడని మండిపడుతున్నారు. కానీ నమన్ ధీర్ ను పైకి లేపి, పాండ్యాను తొక్కెసే కుట్రలు జరుగుతున్నాయని, అందుకే హార్ధిక్ ఇప్పటికీ టీమిండియాలోకి రావడం లేదని అంటున్నారు.