Sreesanth: టీమిండియా వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూ ఉంటాడు. మైదానంలో ప్రత్యర్థులతో గొడవలు పడడం…. ప్రెస్ మీట్ సందర్భంగా హాట్ కామెంట్స్ చేయడం అతనికి అలవాటే. మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వివాదంలో కూడా చిక్కుకున్నాడు. ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ.. అందరినీ గెలుకుతున్నాడు శ్రీశాంత్. తాజాగా ఆడం గిల్ క్రిస్ట్ ( Gilchrist), మాథ్యూ హేడెన్ (Hayden), ఏబీ డివిలియర్స్ (AB de Villiers) లాంటి దిగ్గజ బ్యాటర్లను హేళన చేస్తూ మాట్లాడారు. ఈ ముగ్గురు క్రికెటర్లు తన ముందు పిల్ల బచ్చగాళ్లు అంటూ బాంబు పేల్చారు. తాను వేసే బంతులకు ఆడం గిల్ క్రిస్ట్, మాథ్యూ హేడెన్, ఏబీ డివిలియర్స్ డక్ ఔట్ అవుతారని సంచలన కామెంట్స్ చేశారు.
టీమిండియా ఒకప్పటి దిగ్గజ బౌలర్ శ్రీశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ఒకప్పటి స్టార్ వికెట్ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ ను తాను సింగిల్ బంతికే ఔట్ చేస్తానని వెల్లడించారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అతడిని ఔట్ చేసే శక్తి తనలో ఉందని తెలిపారు. మాథ్యూ హేడెన్ (Hayden) ను కూడా సులభంగా తాను ఔట్ చేస్తానంటూ విర్ర వీగారు. ఇప్పటికే మాథ్యూ హేడెన్ ను ఆరు సార్లు ఔట్ చేసినట్లు గుర్తు చేశారు.
ఇక 360 డిగ్రీ ప్లేయర్ గా ఏబీ డివిలియర్స్ ను చాలా మంది పిలుస్తూ ఉంటారు… అతడిని పొగుడుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. అలాంటి ఏబీ డివిలియర్స్ ను కూడా తాను చాలా సార్లు ఔట్ చేశానని పేర్కొన్నారు. అన్ని ఫార్మాట్లలో ఏబీ డివిలియర్స్ ను ఇప్పటి వరకు 13 సార్లు పెవిలియన్ కు పంపినట్లు వివరించారు. అయినా తనను అందరు తక్కువగా అంచనా వేస్తున్నారని.. ఇప్పటికి కూడా ఎవరినంటే వాళ్లను డకౌట్ చేసే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయన్నారు.
2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఇందులో మిస్బా ఇచ్చిన క్యాచ్ ను శ్రీకాంత్ వెనకాల బౌండరీ గేటు దగ్గర పట్టుకున్నాడు. ఆ క్యాచ్ పట్టుకున్న తర్వాత శ్రీశాంత్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇదే విషయాన్ని తాజాగా శ్రీకాంత్ కూడా వెల్లడించారు. తన బౌలింగ్ కంటే 2007 ఫైనల్స్ లో అందుకున్న క్యాచ్ అందరికీ గుర్తుండి పోయిందని వ్యాఖ్యానించారు. కానీ ఆ క్యాచ్ కంటే తన బౌలింగ్ మరింత డేంజర్ అని తెలిపారు.