Ishan Kishan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఇషాన్ కిషన్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ముంబై ఇండియన్స్ కు ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) అమ్ముడుపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నీతా అంబానీ తో… మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని… ఇషాన్ కిషన్… సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు ( Sunrisers Hyderabad owner Kavya Papa ) అన్యాయం చేస్తున్నాడని.. ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔట్ కాకముందే… పెవిలియన్ కు వెళ్లిపోయాడని హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ పై దుమారం రేగుతోంది.
Also Read: Memes on PSL : ఇదెక్కడి క్రికెట్ రా PSLలో లారీలు వస్తున్నాయి… త్వరలో రైలు కూడా వస్తాయి
ఔట్ కాకముందే వెళ్లిపోయిన ఇషాన్ కిషన్
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Sunrisers Hyderabad vs Mumbai Indians ) మధ్య బుధవారం రోజున ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు… పీకలోత్తు కష్టాల్లో పడింది. అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ పెద్ద వివాదానికి తెరలేపారు. ముంబై తో మ్యాచ్ లో… హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్.. అవుట్ కాకముందే పెవీలియన్ కు వెళ్లిపోయాడని.. సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
ముంబై ఆటగాడు దీపక్ చాహర్ ( Mumbai player Deepak Chahar ) లెగ్ సైడ్ వేసిన బంతిని ఇషాన్ కిషన్ ఆడబోయారు. అయితే ఆ బాల్ నేరుగా వెళ్లి వెనుకాల ఉన్న వికెట్ కీపర్ చేతిలో పడిపోయింది. ఇక వెంటనే ఇషాన్ కిషన్… పెవిలియన్ వైపునకు వెళ్లిపోయాడు. అసలు అప్పుడు బౌలర్, ఫీల్డర్లు, వికెట్ కీపర్ అప్పీల్ చేయలేదు. అటు అంపైర్ కూడా అవుట్ ఇవ్వలేదు. ఇక్కడ హైదరాబాద్ ( ( Sunrisers Hyderabad ) ఆటగాడు…. ఇషాన్ కిషన్… పెవిలియన్ కు వెళ్ళిపోతున్న నేపథ్యంలో.. అది చూసి అంపైర్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఈ దెబ్బకు హైదరాబాద్ ప్లేయర్లతో పాటు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు…. కూడా షాక్ అయ్యారు.
అదే సమయంలో రీప్లే చూస్తే బంతి… కిషన్ కిషన్ బ్యాట్ ను తాకలేదని తేలిపోయింది. దీంతో ఇషాన్ కిషన్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ కు అమ్ముడు పోయాడని…. మ్యాచ్ ఫిక్సింగ్ ( Match Fixing) చేసుకొని హైదరాబాద్ జట్టుకు అన్యాయం చేస్తున్నాడని మండిపడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇలాంటి చెత్త ప్లేయర్ ను… కొనుగోలు చేసి కావ్య మారన్ తప్పు చేసిందని కూడా సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపైన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున… ఇషాన్ కిషన్ ను అసలు ఆడించకూడదని కూడా డిమాండ్ చేస్తున్నారు. అతని ఆడించడం దండగ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: SRH VS MI: ఇంకా SRHకు ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి… ఈ మ్యాచ్ లు గెలుస్తే చాలు
🚨 ISHAN KISHAN DISMISSAL MOMENT 🚨 pic.twitter.com/y75dm8v0bM
— Johns. (@CricCrazyJohns) April 23, 2025
Ishan Kishan still Mumbai Indians 12th man today🤣
Ambani on duty🤣#SRHvMI #SRHvsMI pic.twitter.com/q6kVRG6LYq
— JustMyThoughts (@iambudha_) April 23, 2025