SRH VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే నలభై మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య సాయంత్రం మ్యాచ్ జరగనుంది. 41వ మ్యాచ్లో భాగంగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతోంది. దీంతో ముంబై ఇండియన్స్ కంటే హైదరాబాద్ కు బాగా అడ్వాంటేజ్ ఉండే ఛాన్సులు ఉన్నాయి.
పాయింట్ల పట్టికలో హైదరాబాద్ దారుణ పరిస్థితి
ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఆడిన ఏడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన హైదరాబాద్… ఏకంగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. మైనస్ లో రన్ రేట్ కూడా ఉంది. ఈ దెబ్బకు పాయింట్లు పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది హైదరాబాద్. అటు ముంబై ఇండియన్స్ మాత్రం… తన చివరి మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్ లలో నాలుగు విజయాలను సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో.. ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. ఇవాళ హైదరాబాద్ పైన గెలిస్తే ముంబై మరింత ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కచ్చితంగా ముంబై పై హైదరాబాద్ గెలవాల్సిన పరిస్థితి ఉంది.
ఇంకా ఎన్ని గెలిస్తే ప్లే ఆఫ్ కు హైదరాబాద్ వెళుతుంది?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ప్లే ఆఫ్ కు హైదరాబాద్ వెళ్లే అవకాశాలు ఉన్నాయా అనే దాని పైన చర్చిస్తే… కచ్చితంగా ఉంటాయి. హైదరాబాద్ మరో 7 మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఏడు మ్యాచ్ లలో వరుసగా హైదరాబాద్ కనీసం 6 మ్యాచులలో ఆయన విజయం సాధించాలి. ఒకవేళ ఐదు మ్యాచ్ లలో విజయం సాధిస్తే… మిగతా జట్ల రన్ రేట్ ప్రకారం హైదరాబాద్ కు ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రతి మ్యాచ్ కూడా భారీ తేడాతో హైదరాబాద్ గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికంటే ఏడు మ్యాచ్ లలో కచ్చితంగా ఆరు మ్యాచ్ లు హైదరాబాద్ గెలిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇవాళ ముంబై ఇండియన్స్ ను సొంత గడ్డపై హైదరాబాద్ ఓడించాలి. అప్పుడే దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇవాళ మ్యాచ్ ఓడిపోతే ఇక హైదరాబాద్ ఇంటికి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు. సొంత గడ్డపై గెలవకపోతే హైదరాబాద్ తర్వాత ఆడాల్సిన మ్యాచ్ లన్ని ప్రత్యర్థి గ్రౌండ్ లోనే ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ ఇకనైనా పుంజుకోవాలి.
జట్ల అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఈషాన్ మలింగ
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XII: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్