Kiran Korrapati : ఒక డైరెక్టర్ గా సక్సెస్ కావడం అనేది సులభమైన పని కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది కొన్నేళ్లపాటు కష్టపడి దర్శకులుగా నిలబడ్డారు. మొదటి అవకాశాన్ని వినియోగించుకోవడం ప్రతి దర్శకుడికి చాలా అవసరం. ఒక అవకాశం మిస్ అయింది అంటే రెండో అవకాశం పట్టుకోవడం అనేది ఈ రోజుల్లో గగనం. షాక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్ మొదటి సినిమా ఫీల్ అవ్వడంతో మళ్లీ అసోసియేట్ రైటర్ గా తన కెరియర్ మొదలు పెట్టాడు. మళ్లీ మిరపకాయ్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చాడు. ఇకపోతే వరుణ్ తేజ్ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో గని అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ చవి చూసింది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
గని డిజాస్టర్
ఫస్ట్ ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే చాలా పవర్ ఫుల్ గా ఉంది అని చాలామంది అనుకున్నారు. ఆ తర్వాత బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఇదే కావడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. అయితే దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా తీయలేకపోయాడు. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఈ దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం కూడా మొదలైనట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో ఫెయిల్ అయిన కూడా బాలీవుడ్లో సినిమా పట్టుకున్నాడు అంటే సాహసం అనే చెప్పాలి.
అక్కడ కం బ్యాక్ ఇస్తాడా
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులపై చాలామందికి విపరీతమైన గౌరవం పెరిగింది. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసి వస్తుంది. చాలామంది తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ కి వెళ్లి తమ సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు కిరణ్ కూడా సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు లాగానే అక్కడ కూడా సక్సెస్ సాధిస్తాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా తెలుగులో కం బ్యాక్ ఇవ్వకపోయినా కూడా బాలీవుడ్లో మంచి కం బ్యాక్ ఇచ్చి మళ్లీ తెలుగులో మంచి సినిమా చేయాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Nani : అంటే సుందరానికి బ్యాడ్ ఫిలిం అంటే, వాళ్లతో నేను గొడవ పడతా