BigTV English

OTT Movie : జలియన్‌వాలా బాగ్ ఉదంతం వెనుక ఇంత కుట్ర ఉందా ? సీక్రెట్స్ బట్టబయలు చేసిన మూవీ ఓటీటీలోకి

OTT Movie : జలియన్‌వాలా బాగ్ ఉదంతం వెనుక ఇంత కుట్ర ఉందా ? సీక్రెట్స్ బట్టబయలు చేసిన మూవీ ఓటీటీలోకి

OTT Movie : చారిత్రక సంఘటనల నేపధ్యంలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తుంటారు. స్వాతంత్ర పోరాటం సందర్భంగా జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమైన భారతీయులపై జనరల్ డయ్యర్ 1919 ఏప్రిల్ 13 వ సంవత్సరంలో జరిపిన కాల్పుల్లో ఎంతోమంది భారతీయులు చనిపోయారు. లెక్కల్లో 1400 మంది అని చూపించినా, 3000 ల మందికి పైగా నే చనిపోయారని చరిత్ర కారులు చెప్తారు. ఇప్పటికీ ఆ ఘటన భారతదేశ చరిత్రలో, ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అయితే ఈ ఘటన ఆధారంగా రీసెంట్ గా ఒక మూవీ తెరకెక్కింది. జనరల్ డయ్యర్ కి  వ్యతిరేకంగా, ఈ ఘటన పై కోర్ట్ రూమ్ లో వేడిగా వాదనలు జరుగుతాయి. ప్రతి భారతీయుడికి ఈ సన్నివేశాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జియో హాట్ స్టార్ (Jio Hotstar)

ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ పేరు ‘కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ (Kesari Chapter 2: The Untold Story of Jallianwala Bagh). 2025లో విడుదలైన ఈ మూవీకి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే, రెజీనా కసండ్రా, సైమన్ పైస్లీ డే, అలెక్స్ ఓనెల్, అమిత్ సియాల్, మసాబా గుప్తా, స్టివెన్ హార్ట్‌లీ వంటి నటులు నటించారు. ఇది 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ చుట్టూ తిరుగుతుంది. శంకరన్ నాయర్ అనే న్యాయవాది జీవితం ఆధారంగా రూపొందింది. శంకరన్ నాయర్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేపట్టిన, చట్టపరమైన పోరాటం ఒక ఉధ్యమాన్ని తలపిస్తుంది. ఈ మూవీ 2019లో విడుదలైన కేసరి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. రఘు పలాట్, పుష్ప పలాట్ రాసిన ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. జియో హాట్ స్టార్ (Jio Hotstar) లోకి తొందర్లోనే స్ట్రీమింగ్ కి రాబోతోందని సమాచారం.


స్టోరీలోకి వెళితే

శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) ఒక ప్రముఖ భారతీయ బారిస్టర్, వైస్‌రాయ్ కౌన్సిల్ సభ్యుడు. 1919లో అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన మారణకాండను బ్రిటిష్ ప్రభుత్వం తరపున విచారించే బాధ్యతను అతనికి అప్పగిస్తారు. బ్రిటిష్ అధికారులకు అనుకూలమైన రిపోర్ట్ ఇస్తాడాని ఆశిస్తారు. అయితే, శంకరన్ నాయర్ ఈ విచారణలో జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు, నిరాయుధ పౌరులపై జరిగిన దారుణమైన ఊచకోత గురించిన నిజాలను తెలుసుకుంటాడు. ఈ దారుణ సంఘటన అతని మనస్సాక్షిని కుదిపివేస్తుంది. బ్రిటిష్ అధికారిక చర్యను సవాలు చేస్తూ, జనరల్ డయ్యర్‌పై నాయర్ నరమేధం ఆరోపణలతో కేసు దాఖలు చేస్తాడు. ఈ చట్టపరమైన పోరాటంలో అతనికి యువ న్యాయవాది దిల్‌రీత్ (అనన్యా పాండే), బ్రిటిష్ న్యాయవాది నెవిల్లే మెక్‌కిన్లీ (ఆర్. మాధవన్) తోడవుతారు. ఈ కోర్ట్‌రూమ్ డ్రామా భారత స్వాతంత్ర సమరంలోని ఒక చీకటి అధ్యాయాన్ని, అలాగే న్యాయం కోసం ఒంటరిగా నిలబడిన ఒక వ్యక్తి ధైర్యాన్ని వెలుగులోకి తెస్తుంది.

Read Also : తొమ్మిది ఏళ్లకే కాలేజ్ లో ఎంట్రీ … పిల్లాడే అనుకుంటే పిడుగులా రెచ్చిపోయాడు

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×