Memes on PSL : ఇండియా లో ఐపీల్ మాదిరిగానే.. పాకిస్తాన్ లో పీఎస్ఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి గతంలో ఇక్కడ ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత పీఎస్ఎల్ మ్యాచ్ లు జరిగేవి. కానీ ఈ సారి రెండు మ్యాచ్ లు ఒకేసారి జరగడం విశేషం. ఈ లీగ్ లో ప్రస్తుతం పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటివరకు పీఎస్ఎల్ విరాట్ కోహ్లీ జెర్సీ, ఇద్దరూ ప్లేయర్లు కొట్టుకోవడం ఇలా రకరకాల వార్తలు వైరల్ కాగా.. తాజాగా మరో విషయం వైరల్ అవుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఫోర్ కొట్టిన, సిక్స్ కొట్టిన.. అలా లారీ సౌండ్ వేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం ట్రోలింగ్ చేస్తున్నారు. టీం స్కోర్ టోటల్ 50 కొడితే లారీ వచ్చింది.. 100 కొడితే ట్రైన్ వస్తుందా అని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా మీమ్స్ ట్రోలింగ్ చేయడం విశేషం.
Also Read : SRH VS MI: ఇంకా SRHకు ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి… ఈ మ్యాచ్ లు గెలుస్తే చాలు
పీఎస్ఎస్ లో భాగంగా నిన్న రాత్రి ముల్తాన్ సుల్తాన్ వర్సెస్ లాహోర్ క్వాలెండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బౌలర్ ఉబైద్ షా తన సహచరుడు వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ని కొట్టాడు. ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్ టీమ్ కి చెందిన వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గొడవ జరిగిన సమయంలో కీపర్ ఉస్మాన్ ఖాన్ హెల్మెట్ ధరించకపోవడంతో బలంగా దెబ్బ తాకింది. బౌలర్ ఉబైద్ తన అరచేతి చాచి బలంగా కొట్టాడు. పీఎస్ఎల్ టీమ్ చరిత్రలోనే ఇది ఒక ఆసక్తికర విషయం అనే చెప్పవచ్చు. ఎందుకు ఒక టీమ్ వ్యక్తి మరో టీమ్ కి చెందిన వ్యక్తులు కొట్టుకోవడం సహజం. కానీ ఇక్కడ మరో టీమ్ కి చెందిన వ్యక్తిని కాకుండా ఒకే టీమ్ కి చెందిన ఆటగాడిని కొట్టడం చర్చనీయాంశం అయింది.
అయితే ఈ మ్యాచ్ ని పరిశీలించినట్టయితే.. ముల్తాన్ సుల్తాన్ టీమ్ 229 పరుగులు చేసింది. ఆ తరువాత లాహోర్ క్వాలెండర్స్ 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. లాహోర్ టీమ్ తొలి 4 ఓవర్లలోనే 38 పరుగులు చేసినప్పటికీ.. ఆ తరువాత వికెట్లు పడిపోవడంతో బ్రేక్ లు పడ్డాయి. జమాన్ కేవలం 14 బంతుల్లోనే 32 పరుగులు చేసాడు. అబ్దుల్ షఫీక్, డారెల్ మిచెల్ కీలక ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వీరి భాగస్వామ్యం కేవలం 36 పరుగులు మాత్రమే చేశారు. రజా కూడా 50 పరుగులు చేసినప్పటికీ 33 పరుగుల తేడాతో లాహోర్ క్వాలెండర్స్ టీమ్ ఓడిపోయింది. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లలో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది ముల్తాన్ సుల్తాన్ టీమ్. ఈ ఈ మ్యాచ్ లో మాత్రం 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో రాణించడంతో ఘన విజయం వరించింది.