SRH Retention List 2026: ఐపీఎల్ 2025లో యావరేజ్ గా ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు, రాబోయే IPL 2026 సీజన్ కోసం మినీ-వేలానికి సిద్ధమవుతోంది. మెగా-వేలం జరగకపోయినప్పటికీ, మినీ-వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ కోర్ టీమ్‌ను నిలుపుకొని, మిగిలిన లోటు పాట్లను సరి చేసుకోవడానికి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేస్తాయి. SRH మేనేజ్‌మెంట్ తమ పటిష్టమైన కోర్ గ్రూప్‌ను అలాగే ఉంచుకుంది. అయితే టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ షమీని వదులుకోనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో షమీ కోసం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని క్రిక్ బజ్ వెల్లడించింది.
గత వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను రూ.10కోట్లకు షమీని కొనుగోలు చేసింది. కానీ అతను కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. గత వేలంలో షమీ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.8.5 కోట్ల వరకు వెళ్లింది. కానీ సన్ రైజర్స్ యాజమాన్యం రూ.10కోట్లు వెచ్చించి దక్కించుకుంది. మరోవైపు షమీ గురించి ఇటీవలే మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఐపీఎల్ లో పలు జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు సన్ రైజర్స్ జట్టులో కెప్టెన్ పాట్ కమిన్స్, కీలక ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, అధర్వ, అంకిత్ వర్మ, సచిన్ బేబీ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ, జీసన్ అన్సారి, రవిచంద్రన్, హర్ష్ దూబే, సిమర్ జిత్ సింగ్ వంటి ఆటగాళ్లను వదులుకోవడం లేదు.
సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకునే ఆటగాళ్లలో ముఖ్యంగా అభినవ్ మనోహర్, మొహ్మద్ షమీ, రాహుల్ చాహర్, అడమ్ జంపా, బ్రిండన్ కార్సె, ముల్డర్, కమిందు మెండీస్ వంటి ఆటగాళ్లను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకోనుంది. దీంతో మహ్మద్ షమీని ఈ సీజన్ లో ఏ జట్టు తీసుకుంటే ఆ జట్టు తరపున అద్భుతమైన ప్రదర్శన చేస్తాడని క్రికెట్ అభిమానులు పేర్కొనడం గమనార్హం. ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 వికెట్లు తీయడం విశేషం. ప్రస్తుతం ఉన్న బౌలర్లు కూడా చాలా బాగా రాణిస్తున్నరని గుర్తు చేశారు. అలాగే సౌతాఫ్రికా తో జరుగనున్న తొలి టెస్ట్ లో ఆల్ రౌండర్ లేదా ఎక్స్ ట్రా స్పిన్నర్ ను ఆడించే విషయం పై రేపే నిర్ణయం తీసుకుంటామని సమాధానం చెప్పారు కెప్టెన్ గిల్. 2023 వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతను 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. కానీ కొంతకాలం క్రితం గాయాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన అతను పునరాగమనం చేయలేకపోతున్నాడు. చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించిన షమీ.. 7 మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత టీమిండియా తరపున షమీ ఆడకపోవడం గమనార్హం.
Also Read : IPL Trade: అంబానీ అదిరిపోయే స్కెచ్..విధ్వంసకర బ్యాటర్ తో పాటు బౌలర్ వచ్చేశాడు