E-Paper
Advertisement

IND VS SA : ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్‌..గంభీర్, గిల్ సుదీర్ఘ చర్చ.. పిచ్‌పై అస‌హ‌నం?

IND VS SA : ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్‌..గంభీర్, గిల్ సుదీర్ఘ చర్చ.. పిచ్‌పై అస‌హ‌నం?
Advertisement

IND VS SA :  కోల్ క‌తా వేదిక‌గా రేప‌టి నుంచి భార‌త్, సౌతాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈడెన్ గార్డెన్స్ క్యురేట‌ర్ సుజ‌న్ ముఖ‌ర్జీతో కోచ్ గంభీర్, టీమిండియా కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఇవాళ ప్రాక్టీస్ సెష‌న్ సంద‌ర్భంగా పిచ్ ను కోచింగ్ టీమ్, బీసీసీఐ క్యురేట‌ర్లు, గిల్, రిష‌బ్ పంత్ త‌దిత‌రులు పరిశీలించారు. ఆ త‌రువాత దాదాపు 30 నిమిషాల పాటు డిస్క‌ష‌న్ జ‌రిగింది. ముఖ్యంగా పిచ్ విష‌యంలో టీమ్ మేనేజ్ మెంట్ కాస్త అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. సౌతాఫ్రికా జట్టు భారత పర్యటన టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

Also Read : Gill-Shami : మాకు ఆ బౌలర్ అవసరమే లేదు.. షమీ పరువు తీసిన గిల్

పూర్తిగా కొలుకున్న రిష‌బ్ పంత్..

Advertisement

ఇక ఈ టెస్ట్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. ధ్రువ్ జురెల్ ఆడటం ఖాయమని భావిస్తున్నారు. సహాయక కోచ్ కూడా జురెల్, పంత్ ఇద్దరూ కలిసి ఆడగలరని కన్ఫాం చేశారు. నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కదని బీసీసీఐ ధృవీకరించింది. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన రిషబ్ పంత్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దాదాపు 3 నెలల తర్వాత తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో భారత జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కలయికతో బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు.నితీష్ కుమార్ రెడ్డి కేవలం మొదటి టెస్ట్ నుంచి మాత్రమే బయట ఉన్నాడు. అయితే దీనికి కారణం గాయం కాదు. నితీష్ ఆస్ట్రేలియా పర్యటనలో కూడా గాయపడ్డాడు. అతను కోల్‌కతాకు చేరుకుని సాధన కూడా ప్రారంభించాడు. అతను బహుశా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించలేడు కాబట్టి, బీసీసీఐ అతన్ని సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం భారత ఏ జట్టులోకి విడుదల చేసింది. బీసీసీఐ ప్రకటనలో.. “నితీష్ రాజ్‌కోట్‌లో సౌతాఫ్రికా ఏతో జరిగే వన్డే సిరీస్ కోసం భారత ఏ జట్టులో చేరతాడు. ఏ సిరీస్ ముగిసిన తర్వాత రెండో టెస్ట్ కోసం భారత జట్టులోకి తిరిగి వస్తాడు” అని పేర్కొంది.

ముగ్గురు స్పిన్న‌ర్లు ఆడే ఛాన్స్..!

భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ కలయికలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఆడవచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇద్దరు పేసర్లుగా ఉంటారు. భారత జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డోషెట్ కూడా మీడియాతో మాట్లాడుతూ, ధ్రువ్ జురెల్ సౌతాఫ్రికా ఏ పై 2 సెంచరీలు సాధించాడు, అతను ఈ వారం ఆడతాడని చెప్పారు. నితీష్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించలేడని కూడా ఆయన అన్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు. పంత్ వికెట్ కీపర్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే అతను పూర్తిగా ఫిట్‌గా లేకపోతే, జట్టు యాజమాన్యం అతన్ని మైదానంలోకి దించడానికి తొందరపడదు.

Advertisement

Also Read : Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లైందా..? ఆమె భ‌ర్త ఇత‌నేనా..సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×