E-Paper
Advertisement

T20I Tri-Series 2025: పాకిస్తాన్ లో బాంబు దాడులు.. శ్రీలంక, జింబాబ్వేలతో జ‌రిగే ట్రై సిరీస్ లో మార్పులు..కొత్త షెడ్యూల్ ఇదే

T20I Tri-Series 2025: పాకిస్తాన్ లో బాంబు దాడులు.. శ్రీలంక, జింబాబ్వేలతో జ‌రిగే ట్రై సిరీస్ లో మార్పులు..కొత్త షెడ్యూల్ ఇదే
Advertisement

T20I Tri-Series 2025:  పాకిస్తాన్ దేశంలో వరుసగా బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో వరుసగా క్రికెట్ టోర్నమెంట్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ కొనసాగుతోంది. త్వరలోనే పాకిస్తాన్ దేశంలో టీ20 ట్రై సిరీస్ ( Pakistan T20I Tri-Series 2025) జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ మధ్యంతరంగా తప్పుకున్న ఈ సిరీస్ లో జింబాబ్వే ఎంట్రీ ఇస్తోంది. ఈ ట్రై సిరీస్ లో శ్రీలంక ( Sri Lanka), పాకిస్తాన్ ( Pakistan ), జింబాబ్వే ( Zimbabwe), తలపడనున్నాయి. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ అప్డేట్ చేసి రిలీజ్ చేశారు.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

ట్రై సిరీస్ షెడ్యూల్ (Pakistan T20I Tri-Series 2025 )

Advertisement

పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే మధ్య టి20 ట్రై సిరీస్ జరగనుంది. ఈ ట్రై సిరీస్ నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంటులో మొత్తం ఏడు టి20 లు జరుగుతాయి. ఈ మేరకు తాజాగా కొత్త షెడ్యూల్ ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక ఇస్లామాబాద్ నగరంలో వరుసగా బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఏడు టి20 లు మొత్తం కూడా రావాల్పిండి స్టేడియంలోనే (Rawalpindi Cricket Stadium, Rawalpindi) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ వెల్లడించింది.

పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే మధ్య నవంబర్ 18వ తేదీన మొట్ట మొదటి టి20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 6:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 20వ తేదీన శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య రెండవ టి20, పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య నవంబర్ 22వ తేదీన మూడవ టి20 నిర్వహిస్తారు. ఇక నవంబర్ 23వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే మధ్య నాలుగో టి20 రావాల్పిండి స్టేడియంలో ( Rawalpindi) జరగనుంది. నవంబర్ 25వ తేదీన శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, నవంబర్ 27వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.

Advertisement

నవంబర్ 29వ తేదీ శనివారం రోజున ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గత నెలలో పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఓ వైమానిక దాడికి పాల్పడింది పాకిస్తాన్. ఈ సంఘటనలో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన ముగ్గురు దేశవాళి క్రికెటర్లు మృతి చెందారు. దీంతో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది ఆఫ్ఘనిస్తాన్. ఈ త‌రుణంలోనే, జింబాబ్వే రంగంలోకి దిగుతోంది. ఈ త‌రుణంలోనే శ్రీలంక, జింబాబ్వే, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్ జ‌రుగ‌నుంది.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×