IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad) గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. ఆ జట్టులో ఉన్న కొంత మంది ప్లేయర్లు ముంబై ఇండియన్స్ కు (Mumbai Indians ) అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన ఇషాన్ కిషన్ ( Ishan Kishan), హైదరాబాద్ జట్టుకు అన్యాయం చేస్తూ ఉన్నాడని కావ్య పాప ( Kavya Maran) సీరియస్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన కావ్య పాప స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇశాన్ కిషన్ తో క్షమాపణలు కూడా చెప్పించుకున్నారట కావ్య పాప.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగనుంది. డిసెంబర్ 15వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం నిర్వహించబోతున్నారట. ముంబైలో ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ నేపథ్యంలో నవంబర్ 15వ తేదీ లోపు రిటెన్షన్ లిస్టును ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు ఆదేశాలకు కూడా వెళ్లాయి.
ఇలాంటి నేపథ్యంలో ఇశాన్ కిషన్ ను వదిలేయాలని కావ్య పాప ఈ నిర్ణయం తీసుకున్నారట. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ సమయంలో ముంబై ఇండియన్స్ కు అనుకూలంగా ఇశాన్ కిషన్ వ్యవహరించినట్టు ఆమె గుర్తించారట. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడట. గతంలో ఈ విషయాన్ని గుర్తించి మనసులో పెట్టుకున్న కావ్య పాప, ఈ సారి ఇషన్ కిషన్ ను తొలగించాలని డిసైడ్ అయ్యారట. వేలంలో అతని వదిలేస్తున్నట్లు ఇప్పటికే చెప్పారట. ముందుగా అతనితో క్షమాపణలు చెప్పించుకొని, వదిలేస్తున్నట్లు అతనికి సమాచారం ఇచ్చారట కావ్య పాప. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి హైదరాబాద్ జట్టుకు ఇశాను కిషన్ దూరం కాబోతున్నాడని సమాచారం.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఈ సారి ఇషాన్ కిషన్ తో పాటు మరికొంత మంది ప్లేయర్లను వదిలేసేందుకు కావ్య పాప నిర్ణయం తీసుకున్నారట. ఆడం జంపా, రాహుల్ చాహర్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి ప్లేయర్లను వదిలేసేందుకు నిర్ణయం తీసుకున్నారట. అటు షమీ, హెడ్, అభిషేక్ శర్మ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ను జట్టులో రిటైన్ చేసుకోనున్నారట. అయితే, హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) జట్టులో నుంచి వదిలేసి, వేలంలో తక్కువ ధరకే అతన్ని కొనుగోలు చేయాలని భావిస్తోన్నారట కావ్యా పాప. ప్రస్తుతం ఆయనకు రూ.23 కోట్లు ఇస్తున్నారు. వేలంలో మళ్లీ కొనుగోలు చేస్తే, తక్కువ ధరనే అతను పలుకుతాడు.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
🚨 SRH warned ISHAN KISHAN 🚨
"Intially SRH management wanted to kick Ishan out but due to his constant crying, sobbing and personally apologized and said he won't bribe this time with MI owners so they decided to retain"
(Source : Crcibuzz)pic.twitter.com/96LreYIBUK
— AK21 (@AkramK2108) November 9, 2025