Bigg Boss 9 Telugu Day 63 : బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతి శనివారం నాగార్జున హౌస్ మేట్స్ కు వేసే మొట్టికాయలు చూసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాయి. అందుకే సాధారణంగా మిగతా రోజుల కంటే వీకెండ్ ఎపిసోడ్ లను చూడడానికే చాలామంది ఆసక్తిని చూపిస్తుంటారు. కానీ ఈ శనివారాన్ని మాత్రం ఎప్పటిలా కాకుండా ‘శివ’ రీరిలీజ్ సెలబ్రేషన్స్ కోసం అంకితం చేశారు బిగ్ బాస్. దీంతో ఆడియన్స్ నీరస పడిపోయారు. కానీ సండే ఎపిసోడ్లోనే అసలు స్టోరీ అంతా ఉంది. డే 63 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి ఎపిసోడ్లో ఫన్ తో పాటు ఫైర్ ను కూడా చూపించారు నాగార్జున. కొన్ని సినిమాల నుంచి క్లిప్స్ చూపించి, ఫజిల్ లాంటి ప్రశ్నలు అడిగారు నాగ్. దీని కోసం దివ్య, డెమోన్, రీతూ, భరణి, సుమన్, కళ్యాణ్ ఒక టీం. మిగతా వాళ్ళు ఒక టీమ్. ఇందులో రీతూ టీం విన్ అయ్యింది.
తరువాత ఈ హౌస్ లో ఉన్న హౌస్ మేట్లలో ట్రోఫీకి దగ్గరగా ఎవరు, దూరంగా ఎవరు వెళ్తున్నారు? అనేది ఒక్కొకరుగా చెప్పమన్నారు నాగార్జున. సుమన్ శెట్టి ఇమ్మాన్యుయేల్ ట్రోఫీకి దగ్గరగా, సాయి దూరంగా వెళ్తున్నాడు అని చెప్పాడు. కళ్యాణ్ తనూజాను టాప్ లో, భరణికి ఎగ్జిట్ ఇచ్చాడు. భరణి ఇమ్మూకు ట్రోఫీ ఇవ్వగా… సాయి భరణికి ఎగ్జిట్, తనూజాకు ట్రోఫీ ఇచ్చాడు. సంజన డెమోన్ కు ట్రోఫీ, గౌరవ్ కి ఎగ్జిట్… దివ్య గౌరవ్ కి ఎగ్జిట్ , ఇమ్మూకి ట్రోఫీ… నిఖిల్ తనూజాకు ట్రోఫీ, సుమన్ కు ఎగ్జిట్ ఇచ్చారు.
గౌరవ్ దివ్యాది పర్సనల్ రీజన్ ఇది అనడంతో… ఊరికే చిరాకు పడుతున్నావ్ ఎందుకు? కెప్టెన్ కు కూడా ఎదురు తిరిగావు. ఫుడ్ మీద కోపాన్ని చూపించకూడదు అంటూ నాగ్ అతనికి వార్నింగ్ ఇచ్చారు. నిన్ను ఫైనల్ కంటెండర్ దగ్గర మోసం చేశారు కదా… ఏం అనిపించింది ? అని కళ్యాణ్ ను అడిగారు నాగ్. తియ్యను అని చెప్పి తీసింది దివ్య. అది కాస్త బాధ అనిపించింది అని చెప్పాడు కళ్యాణ్. దీంతో నీకోసం ఒక వీడియో అంటూ ప్లే చేశారు. అందులో దివ్య కావాలని భరణిని పక్కన పెట్టి, కళ్యాణ్ ను తీసేయడాన్ని చూపించారు. చెప్పేటప్పుడు భరణిని ఎందుకు కౌంట్ చేయలేదు? అతన్ని గేమ్ నుంచి తీసేయాల్సి వస్తుందనా? అని అడిగారు నాగ్. వెంటనే భరణి లేచి ఆమె చెప్పేలోపు లేవబోయారు అనే డౌట్ ను సుమన్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసింది అంటూ ఏదో చెప్పబోయాడు. ఎలాగూ నువ్వు స్టాండ్ తీసుకోవు. కూర్చో అంటూ అంతన్ని కూర్చోబెట్టారు. ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి గానీ ఓటమి కోసం కాదు అంటూ దివ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.
ఇక చివరగా నామినేషన్లలో భరణి – సాయి మిగలగా… తనూజా నీకిచ్చిన గోల్డెన్ బజర్ ను వాడతావా లేదా ? అని అడిగారు. కానీ తనూజా నేనైతే ఆ పవర్ ను వాడను. ఆడియన్స్ తీర్పును గౌరవిస్తాను అని చెప్పింది. దీంతో ఇద్దరిలో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పటికే రామూ సెల్ఫ్ ఎవిక్షన్ కావడంతో సాయితో కలిపి ఈవారం డబుల్ ఎలిమినేషన్ అయ్యింది బిగ్ బాస్ హౌస్ లో.
Read Also : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?