E-Paper
Advertisement

AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం.. మంచి వేతనం, ఎయిమ్స్ బీబీనగర్‌లో ఉద్యోగాలు

AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం.. మంచి వేతనం, ఎయిమ్స్ బీబీనగర్‌లో ఉద్యోగాలు
Advertisement

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS), బీబీనగర్ నిరుద్యోగ వైద్య పట్టభద్రులకు శుభవార్త చెప్పింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్‌ (JR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23, 2026 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పోస్టుల వివరాలివే… 

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత కాలపరిమితి వరకు బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో సేవలు అందించాల్సి ఉంటుంది.

విద్యార్హత, ఎక్స్ పీరియన్స్.. 

Advertisement

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పోస్టుల స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన కాలపరిమితిని కూడా నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు ఫీజు వివరాలు.. 

అభ్యర్థులు కేటగిరీల వారీగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జనరల్, ఓబీసీ (OBC) అభ్యర్థులకు: రూ. 1,180

ఈడబ్ల్యూఎస్‌ (EWS) అభ్యర్థులకు: రూ. 944

ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఉద్యోగ ఎంపిక విధానం.. 

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, విద్యార్హతలను పరిశీలించిన అనంతరం అర్హులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం మరియు వేదిక వివరాలను ఎయిమ్స్ బీబీనగర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు.

ముఖ్యమైన తేదీల వివరాలు.. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఫారమ్‌ను నింపవచ్చు. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 23 ఫిబ్రవరి, 2026. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలను నివారించడానికి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని వివరాల కోసం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం బీబీనగర్ ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

అఫీషియల్ వెబ్ సైట్: https://aiimsbibinagar.edu.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×