BigTV English

Sri Lankan Team: శ్రీలంకను ఇక టచ్‌ చేయలేరు.. అక్కడ బాహుబలి ఉన్నాడు !

Sri Lankan Team: శ్రీలంకను ఇక టచ్‌ చేయలేరు.. అక్కడ బాహుబలి ఉన్నాడు !

Sri Lankan Team: శ్రీలంక జట్టు మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు ఆ జట్టును ఓడించాలంటే మిగతా జట్లు గడగడలాడిపోతున్నాయి. ముఖ్యంగా టెస్ట్ లు, టీ-20 ల విషయాన్ని పక్కన పెడితే.. లంక జట్టు వన్డేల్లో అమోఘంగా రాణిస్తోంది. సంగర్కర, జయవర్ధనే శకం ముగిసిన తర్వాత చాలా కాలం పాటు వరుస ఓటములతో సతమతమయ్యింది శ్రీలంక జట్టు. కానీ ఇప్పుడు {Sri Lankan Team} బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొడుతోంది. పేలవమైన ప్రదర్శనతో కనుమరుగు ఖాయమేనన్న చర్చ జరిగిన సమయంలో శ్రీలంక జట్టును విజయాల పట్టాలు ఎక్కించారు జయసూర్య.


Also Read: Boycott RCB: మీకు ఎంత కొవ్వురా… మమ్మల్నే ’11’ అని ట్రోల్ చేస్తావా.. RCBపై గరం గరం

సనత్ జయసూర్యను శ్రీలంక జట్టుకు ప్రధాన కోచ్ గా లంక క్రికెట్ బోర్డు నియమించిన విషయం తెలిసిందే. 2024 అక్టోబర్ 1 న జయసూర్య కి కోచ్ బాధ్యతలను అప్పగించారు. 2026 మార్చి 31 వరకు ఆయన ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తారు. జయసూర్య జమానాలో భారత్, న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్లను మట్టికరిపించింది శ్రీలంక. తాజాగా శ్రీలంక.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై {Sri Lankan Team} సంచలన విజయం సాధించింది.


అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక వన్డే సిరీస్ ని 2-0 తో క్లీన్ స్వీప్ చేసుకుంది. 2024లో భారత్ ని సైతం 2-0 తో ఓడించింది. ప్రస్తుతం శ్రీలంక జట్టులో {Sri Lankan Team} ఉన్న ఆటగాళ్లు పాతవారే అయినప్పటికీ.. జయ సూర్య ఆధ్వర్యంలో వారు రాటుదేలుతున్నారు. చరిత్ అసలంక, కుసాల్ మెండీస్, నిస్సంక, కమెందు మెండీస్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు లంక జట్టు బౌలింగ్ కూడా మరింత బలపడింది.

జయసూర్య లంక జట్టుకు కోచ్ గా రాకముందు.. చిన్న చిన్న జట్ల చేతుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. కానీ జయసూర్య వచ్చినప్పటినుండి భారత్, ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్లకు కూడా చెమటలు పట్టిస్తోంది. 1996 వన్డే వరల్డ్ కప్ లో {Sri Lankan Team} ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. ఏకంగా టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఆ తరువాత రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్ లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది.

Also Read: ICC Champions Trophy: స్ఫెషల్‌ సెక్యూరిటీతో దుబాయ్‌ కు టీమిండియా.. ఇదిగో వీడియోలు

1999లో వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజిలో పరిమితమై, 2003లో సెమీస్ కి, 2007, 11 లో ప్రపంచ కప్ ఫైనల్స్ కి చేరింది లంక. 2017 వరల్డ్ కప్ వరకు వన్డేలో లంక ప్రయాణం సాఫీగా సాగింది. కానీ గత దశాబ్ద కాలంగా ఆ జట్టు వరుస ఓటములతో సతమతమయ్యింది. కానీ జయసూర్య రాకతో ఇప్పుడు {Sri Lankan Team} మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చింది. చరిత్ అసలంక నాయకత్వంలో, జయసూర్య కోచింగ్ లో రానున్న ఐసీసీ వేదికలపై కూడా తమ జట్టు రాణిస్తుందని భరోసా కల్పిస్తోంది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×