Boycott RCB: ఫిబ్రవరి 14 శుక్రవారం రోజున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు గుజరాత్ జెయింట్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మందాన మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు కెప్టెన్ ఆష్లే తుఫాన్ ఇన్నింగ్స్ తో 201 పరుగులు చేసింది.
Also Read: ICC Champions Trophy: స్ఫెషల్ సెక్యూరిటీతో దుబాయ్ కు టీమిండియా.. ఇదిగో వీడియోలు
ఆ తర్వాత ఈ భారీ స్కోరును చేదించే క్రమంలో ఆర్సిబి కేవలం 14 పరుగులకే తమ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఎల్లీస్ పెర్రీ పవర్ ఫుల్ హిట్టింగ్ తో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది. అలా 37 బంతుల్లో 57 పరుగులు చేసిన తర్వాత ఆమె కూడా పెవిలియన్ చేరింది. ఆ తరువాత రిచా ఘోష్, అహుజా ఆచితూచి ఆడుతూ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టును గెలుపు వైపుకు తీసుకువెళ్లారు.
దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఆర్.సి.బి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును చేదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. అయితే ఈ గెలుపు సందర్భంగా ఆర్సిబి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇందులో 11:11 అని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పెట్టినట్లు వైసిపి వాళ్లు అపార్థం చేసుకొని #boycottRCB అంటూ కొందరు వైసిపి సానుభూతిపరులు ట్వీట్ చేస్తున్నారు.
ఈ పోస్ట్ పై ఓ వైసీపీ సానుభూతిపరుడు స్పందిస్తూ.. ” ఎంత కొవ్వురా మీకు. జీవితంలో ఒక్కసారి కూడా కప్ కొట్టని మీకే అంత ఉంటే.. సింగిల్ గా పోటీ చేసి 151 సీట్లు గెలిచిన మాకు ఇంకెంత ఉండాలి. ఏం చూసుకొని 11 అని ఎగిరి పడుతున్నారు. ఈ ఐపీఎల్ లో మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. # boycottRCB” అని ట్వీట్ చేశాడు. నిన్నటి వరకు లైలా సినిమా గురించి బాయ్ కాట్ అని సాగిన ప్రచారం.. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకి మారింది.
అయితే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఈ పోస్ట్ ఎందుకు చేసిందో తెలియదు కానీ.. మొత్తానికి ఈ ట్వీట్ మాత్రం వివాదంగా మారింది. విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృద్వి సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ 150 మేకలలో చివరకు 11 మిగిలాయని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. దీంతో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని వైయస్సార్సీపి వింగ్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో హీరో, నిర్మాత క్షమాపణలు కోరాల్సింది వచ్చింది. ఇప్పుడు ఆర్సీబీ చేసిన ట్వీట్ మరోసారి వివాదానికి కారణమైంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో #BoycottRCB
కొందరు వైసీపీ సానుభూతిపరుల ట్వీట్లు@Shiva4TDP #Telangana #Hyderabad #TDP #NaraLokesh #YSRCP #YSJagan #Janasena #Congress #RevanthReddy pic.twitter.com/CjXGhSLClt
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 15, 2025