ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు దుబాయ్ పర్యటనకు బయలుదేరింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ ని ఫిబ్రవరి 20న ఆడబోతుంది. ఈ నేపథ్యంలో నేడు ముంబై విమానాశ్రయం నుండి భారత ఆటగాళ్లు పయనమై వెళ్లారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సహా ఈ టోర్నీకి ఎంపికైన జట్టు సభ్యులు అందరూ దుబాయ్ కి పయనమయ్యారు.
ఈ టోర్నీలో భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ దాదాపు 3 వారాలపాటు కొనసాగనుంది. దీంతో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. కొత్త విధానం ప్రకారం 45 రోజులకు మించిన టోర్నీలో మాత్రమే కుటుంబ సభ్యులు గరిష్టంగా రెండు వారాలపాటు జట్టుతో ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కాకుండా సింగిల్ గానే దుబాయ్ కి పయనమయ్యారు.
ఈ టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న మొదట బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఆ తర్వాత 23న దాయాది పాకిస్తాన్ తో తలపడుతుంది. ఇక మార్చ్ 1 న కివీస్ తో రోహిత్ సేన తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ ఎంపికపై తాజాగా మాజీ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. తుది జట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు.
అశ్విన్ మాట్లాడుతూ.. ” దుబాయికి ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు మాత్రం అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్ పై వేటువేసి.. అతడి స్థానంలో స్పిన్నర్ల సంఖ్యను ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేక నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగా ఊహించాం. కానీ దుబాయ్ కి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్లడం అవసరమా. ఒక్కరూ లేక ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా..? పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుది జట్టులో ఉంటారు.
Also Read: Pakisthan – Kohli: కోహ్లీ, RCB జిందాబాద్..బాబర్ డౌన్ డౌన్ అంటూ పాక్ ఫ్యాన్స్ రచ్చ…!
కుల్దీప్ కూడా ఆడతాడు. అలాంటప్పుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేస్ బౌలర్ ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా ని రెండవ పేసర్ గా ఉపయోగించుకోవాలి. లేదంటే స్పిన్నర్ ని తప్పించి మూడో సీమర్ ని తుది జట్టులోకి తీసుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ నేరుగా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. మరి వరుణ్ కి ఎలా చోటు ఇస్తారు..? దుబాయ్ లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా..? నేను మాత్రం ఈ జట్టు ఎంపిక తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నాను” అని తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తెలిపారు అశ్విన్.
TEAM INDIA HAVE LEFT FROM AIRPORT FOR CHAMPIONS TROPHY. 🏆
– Good luck, Rohit and his boys! 🇮🇳pic.twitter.com/PRqGDRn0ac
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 15, 2025