NTPC Limited Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), న్యూఢిల్లీ.. ఫిక్స్ డ్ టర్మ్ ప్రతిపాదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్నఅభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. ఈ రోజు నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన లో వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), న్యూ దిల్లీ.. ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగన అభ్యర్థులు మార్చి 1వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 400
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరి వారీగా ఉద్యోగాలు:
యూఆర్: 172 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్: 40 ఉద్యోగాలు
ఓబీసీ: 82 ఉద్యోగాలు
ఎస్సీ: 66 ఉద్యోగాలు
ఎస్టీ కేటిగరిలో 40 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 1
విద్యార్హత: ఇందులో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 శాతం మార్కులతో మెకానిక్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,000 వేతనం ఇవ్వనున్నారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ- ఎన్ సీఎల్ వారికి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, పిీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ అభ్యర్థలు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు)
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్, అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://careers.ntpc.co.in/recruitment/
అర్హత కలిగిన అభ్యర్థులు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), న్యూ దిల్లీ.. ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC) లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు.
ముఖ్యమైనవి:
మొత్తం పోస్టుల సంఖ్య: 400
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 1