E-Paper
Advertisement

15 ఏళ్ల వైభవ్ పై అతిగా ఆశలు పెట్టుకోవద్దు…శ్రీలంక మాజీ బౌలర్ వార్నింగ్

15 ఏళ్ల వైభవ్ పై అతిగా ఆశలు పెట్టుకోవద్దు…శ్రీలంక మాజీ బౌలర్ వార్నింగ్
Advertisement

Farveez Maharoof on Vaibhav:  జింబాబ్వే వర్సెస్ ఇండియా (Zimbabwe vs India) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ (T20 Series) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ( vaibhav sooryavanshi) అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్న ఇంగ్లాండ్ టూర్ లో విఫలమైనప్పటికీ… జింబాబ్వేపై మాత్రం ఇరగదీశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్. దీంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా వైభవ్ సూర్యవంశ్ పై శ్రీలంక క్రికెటర్ ఫర్వీజ్ మహరూఫ్ (Farveez Maharoof ) కీలక వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ పై అతిగా ఆశలు పెట్టుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారు. వైభవ్ ను గుడ్డిగా నమ్మితే, టీమిండియా మునగడం పక్కా అంటూ హెచ్చరించారు.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

15 ఏళ్ల వైభవ్ పై అతిగా ఆశలు పెట్టుకోవద్దు…శ్రీలంక బౌలర్ వార్నింగ్

Advertisement

జింబాబ్వే పై అదిరిపోయే అర్థ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ ఫర్వీజ్ మహరూఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని వెల్లడించారు. కానీ వైభవ్ సూర్యవంశీ పై టీమిండియా, భారతదేశ అభిమానులు ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటున్నారని తెలిపారు. అతిగా అంచనాలు పెట్టుకోవడం ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చారు. దీనివల్ల 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ పైన తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుందని వివరించారు. ఒత్తిడి పెరిగితే వైభవ్ పెద్దగా ప్రదర్శన చేసే అవకాశాలు ఉండబోవమని వివరించారు.

ఆటగాడిపై అధిక ఒత్తిడి పెట్టడం వల్ల.. గాయాల బారిన పడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. చిన్నవయసులో వైభవ్ ఉన్నాడు కాబట్టి.. పెద్ద పెద్ద మ్యాచ్ లలో అతడు ఆడడం కష్టమేనని కూడా తెలిపారు. పూర్వ క్రికెటర్లకు సహజంగా నేర్చుకుంటూ ఎదగడానికి అవకాశం మాత్రమే ఇవ్వాలని తెలిపారు. ఎక్కువగా వైభవ్ పైన ప్రెషర్ పెట్టి ఇబ్బంది పెట్టకూడదని తెలిపారు. ప్రతి మ్యాచ్ లో సెంచరీ లేదా అర్థ సెంచరీ కొట్టడం కష్టమేనన్నారు. మైదానాలను బట్టి బ్యాటర్ ఆడతాడని… ఫ్లాట్ మైదానాలలో రెచ్చిపోతాడని వివరించారు.

Advertisement

అదే బౌన్స్ పిచ్ లలో వైభవ్ ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయని తెలిపారు శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ ఫర్వీజ్ మహరూఫ్ (Farveez Maharoof ). వైభవ్ సూర్య వంశీకి (Vaibhav) ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని కూడా బీసీసీఐని ( BCCI) కోరారు. ప్రస్తుతం టీమిండియాలో అనుభవజ్ఞులు ఉన్నారు.. వాళ్లతో నిత్యం ఆడిస్తే అతని కెరీర్ బాగుంటుందన్నారు. ఈ వరల్డ్ కప్ కాకపోయినా.. తర్వాత వచ్చే వరల్డ్ కప్ వరకు.. సచిన్ టెండూల్కర్ కంటే గొప్పవాడు అవుతాడని కితాబు ఇచ్చారు. ఆ దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని కోరారు.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

 

 

Related News

ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కొనే మొనగాడు లేడు…కోహ్లీ కూడా డకౌట్ అవుతాడు

టీమిండియా గెలిస్తే చాలు, వరల్డ్ కప్ గెలిచినట్టే..పాకిస్తాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

కోహ్లీని మ‌ళ్లీ రెచ్చ‌గొట్టిన ట్రావిస్ హెడ్…వాళ్ల‌కు కొంచెం కూడా బుర్ర లేదంటూ!

7వ, 8వ స్థానాల్లో ఉన్న పాకిస్తాన్, 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కొడుతుంద‌న‌డం అత్యాశే

కొంప‌ముంచిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్..దేశ ద్రోహి అంటూ షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్

బీసీసీఐ పొమ్మ‌న‌క‌ముందే, వెళ్లిపో…లేక‌పోతే మెడ‌లు ప‌ట్టి గెంటేస్తారు, గంభీర్ కు కైఫ్ హెచ్చ‌రిక‌

ఐపీఎల్ 2027ను దెబ్బ‌కొట్టేందుకు పాకిస్తాన్ మ‌రో కుట్ర‌, న‌ఖ్వీ గాడిని ఉరి తీయాలంటూ ట్రోల్స్‌

Big Stories

Advertisement
×