E-Paper
Advertisement

ఏసీ కోచ్‌లో రెండు బెడ్ షీట్లు ఎందుకు ఇస్తారు? అసలు కారణం ఇదే!

ఏసీ కోచ్‌లో రెండు బెడ్ షీట్లు ఎందుకు ఇస్తారు? అసలు కారణం ఇదే!
Advertisement

Indian Railways Bedroll Rules Explained: రైల్లో ఏసీ కోచ్‌లో ప్రయాణించిన ప్యాసింజర్స్ ఒక విషయం తప్పకుండా గమనించి ఉంటారు. బెడ్‌ రోల్ కిట్‌ లో ఒకటి కాకుండా రెండు బెడ్ షీట్లు ఇస్తారు. చాలా మంది దీనిని సాధారణ విషయంగానే భావిస్తారు. కానీ, రెండు బెడ్ షీట్లు ఇవ్వడం ఓ పెద్ద కథ ఉంది. అదేంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రయాణికుల సౌకర్యం కోసం బెడ్ రోల్ కిట్

సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులు రాత్రి సమయంలో సౌకర్యంగా విశ్రాంతి తీసుకునేలా భారతీయ రైల్వే ఈ బెడ్‌రోల్ కిట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో చల్లటి వాతావరణం ఉండటంతో పరిశుభ్రంగా, సౌకర్యంగా నిద్రపోవడానికి అవసరమైన వస్తువులను అందించడం రైల్వే విధానంలో భాగంగా ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం ఫస్ట్ ఏసీ,  సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ,  ఏసీ ఎకానమీ కోచ్‌లలో ప్రయాణించే వారికి బెడ్‌రోల్ కిట్ ఉచితంగా లభిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. బెడ్‌రోల్‌కు సంబంధించిన ఛార్జ్ టికెట్ ధరలోనే తీసుకుంటారు. ఒక బెడ్‌ రోల్ ప్యాక్‌ లో రెండు బెడ్ షీట్లు, ఒక దిండు కవర్, ఒక హ్యాండ్ టవల్ ఉంటాయి. కొన్ని రైళ్లలో సీజన్‌ ను బట్టి దుప్పటి కూడా అందిస్తారు. ప్రయాణికుడు ఎక్కిన వెంటనే ఈ కిట్‌ ను అందజేస్తారు. లేదంటే, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచుతారు.

రెండు బెడ్ షీట్లు మాత్రమే ఎందుకు ఇస్తారు?

Advertisement

అయితే.. రెండు బెడ్ షీట్లు ఎందుకు ఇస్తారు? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణం పరిశుభ్రత. ఒక బెడ్ షీట్‌ ను సీటు, బెర్త్‌ పై పరుచుకోవడానికి ఉపయోగించాలి. దీంతో ప్రయాణికుడు నేరుగా బెర్త్‌ పై పడుకోవాల్సిన అవసరం ఉండదు. మరో బెడ్ షీట్‌ ను దుప్పటి కప్పుకునే ముందు దానిపై పరుచుకోవచ్చు. లేదంటూ పడుకునే ముందు కప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దుప్పటి నేరుగా శరీరాన్ని తాకకుండా ఉంటుంది. పరిశుభ్రతను మెరుగుపరచడంలో సాయపడుతుంది.

అంతేకాకుండా, ప్రతి ప్రయాణికుడి అవసరం ఒకేలా ఉండదు. కొందరు ఒక బెడ్ షీట్‌ను పరచుకుని, మరోదాన్ని కప్పుకోవడానికి ఉపయోగిస్తారు. మరికొందరు దిండు మీద అదనపు కవర్‌ లా ఉపయోగిస్తారు. ఈ విధంగా రెండు బెడ్ షీట్లు ఉండటం వల్ల ప్రయాణికులు తమ అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏసీ కోచ్‌ లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో దుప్పటి కింద అదనంగా బెడ్ షీట్ వాడటం వల్ల మరింత సౌకర్యంగా ఉంటుంది. అలాగే, శుభ్రతపై శ్రద్ధ పెట్టే ప్రయాణికులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

భారతీయ రైల్వే ప్రతి ప్రయాణం తర్వాత ఈ బెడ్‌ రోల్ వస్తువులను సేకరించి, శుభ్రపరిచి, పరిశుభ్రంగా ఉతికి మళ్లీ ప్రయాణికులకు అందించేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో ప్రతి ప్రయాణికుడికి పరిశుభ్రమైన బెడ్‌ రోల్ అందేలా చూసే ప్రయత్నం చేస్తుంది. ఏసీ కోచ్‌లలో రెండు బెడ్ షీట్లు ఇవ్వడం వెనుక.. ప్రయాణికులకు ఎక్కువ సౌకర్యం కల్పించడం, పరిశుభ్రతను కాపాడటం, దుప్పటిని నేరుగా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా చూడటం, ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడం కోసం రైల్వే ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

Read Also: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. లగేజీ బుకింగ్ ఇక మరింత ఈజీ!

Related News

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

Big Stories

Advertisement
×