RCB VS CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Chennai Super Kings ) మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించిన రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో స్ట్రాటజిక్ టైం ఔట్ అంటూ ప్రకటించారు అంపైర్లు. ఈ సందర్భంగా తాము చెప్పకుండా Strategic Time Out పైన అంపైర్లు నిర్ణయం తీసుకోవడం ఏంటని బెంగళూరు కోచ్ దినేష్ కార్తీక్, కెప్టెన్ రజత్ పటిదార్ ఇద్దరూ సీరియస్ అయ్యారు. అంపైర్లను బండ బూతులు తిడుతూ కనిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్లను బెంగళూరు ప్లేయర్లు బెదిరించారని సీరియస్ అవుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా స్ట్రాటజిక్ టైం ఔట్ వివాదం రాజుకుంది. తాము చెప్పక ముందే స్ట్రాటజిక్ టైం ఔట్ ను అంపైర్లు ప్రకటించారని దినేష్ కార్తీక్ అలాగే రజత్ పటిదార్ గ్రౌండ్ లో సీరియస్ అయ్యారు. అయితే ఈ స్ట్రాటజిక్ టైం ఔట్ అయిన తర్వాత, వెంటనే పైడికల్ 50 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీనంతటికి కారణం అంపైర్ల తప్పుడు నిర్ణయమని సీరియస్ అయ్యారు ఆర్సీబీ ప్లేయర్లు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. అంపైర్లను కొట్టేందుకు దినేష్ కార్తీక్, రజత్ పటిదార్ ప్రయత్నించాలని పోస్టులు పెడుతున్నారు సీఎస్కే ఫ్యాన్స్.
2025 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోలుకున్నట్లు దాఖలు కనిపించడం లేదు. ప్రతి మ్యాచ్ లోను ఓడిపోతోంది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోని సైడ్ అయిపోయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి క్రమక్రమంగా దిగజారుతోంది. ఇక ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆ చెన్నై సూపర్ కింగ్స్, అన్నింటిలోనూ ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో కూడా చిట్ట చివరన నిలిచింది చెన్నై. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయిందని.. గతంలో ఐదు టైటిల్ గెలిచినా కూడా ఇప్పుడు లాభం లేకుండా పోయిందని ఆర్సిబి ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
Shameless Act by Rajat Pattidar, Rcb support staff got drinks for both padikkal and rajat , umpire drank one from it and just look at the reactions by them, poor guy. pic.twitter.com/xBGMIjiLMt
— U' (@toxifyxe) April 6, 2026