E-Paper
Advertisement

Surya Kumar Yadav-Usman Tariq: ఉస్మాన్ తారిక్ అవ‌తారం ఎత్తిన సూర్య భాయ్‌..ఇక పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు జాగార‌మే

Surya Kumar Yadav-Usman Tariq: ఉస్మాన్ తారిక్ అవ‌తారం ఎత్తిన సూర్య భాయ్‌..ఇక పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు జాగార‌మే

Surya Kumar Yadav-Usman Tariq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan Match) మధ్య మరి కొన్ని గంటల్లో మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయింది. కొలంబోలోని ఈ ప్రేమ దాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo ) వేదికగా ఇరు జట్ల మధ్య ఫైట్ ఉంటుంది. అయితే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ అందరికీ టెన్షన్ పుట్టిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అదిరిపోయే ప్లాన్ వేశాడు. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( usman tariq) తరహా లోనే నెట్స్ లో సూర్యకుమారి యాదవ్ ( Surya Kumar yadav) బౌలింగ్ చేశాడు. టీమిండియా ప్లేయర్లకు ఆత్మవిశ్వాసం పెరిగేలా ఉస్మాన్ తారిక్‌ లాగానే బౌలింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు సూర్య భాయ్. ఈ దెబ్బకు ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో మనోళ్లు ఇరగదీయడం గ్యారంటీ అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

ఉస్మాన్ తారిక్ అవ‌తారం ఎత్తిన సూర్య భాయ్‌..ఇక పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు జాగార‌మే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అతని బౌలింగ్ లో బ్యాటర్లు ఆడేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఇండియా కోసం ఉస్మాన్ తారిక్ ను సిద్ధం చేసింది పాకిస్తాన్. అతని ద్వారా ఇండియాను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ కుట్రలకు తెర లేపింది. అయితే పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టేందుకు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అదిరిపోయే ప్లాన్ చేశాడు.

నిన్నటి నుంచి నెట్ ప్రాక్టీస్ లో ఉస్మాన్ తారిక్ తరహాలోనే సూర్య కుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేశారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లకు ఉస్మాన్ తారిక్ లాగా ఆగి ఆగి బౌలింగ్ చేశాడు. అచ్చం ఉస్మాన్ తారిక్ ను దింపేశాడు సూర్య కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలోనే అతని బౌలింగ్ లో ఆడేందుకు ఇండియన్ ప్లేయర్లు కూడా ఆసక్తి చూపించారు. ఇదే ఫార్ములాను మ్యాచ్ లోను ప్రదర్శించాలని సూర్యకుమార్ యాదవ్… ప్లేయర్ లందరికీ సలహాలు ఇచ్చాడు. ఒకవేళ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తే, నెట్ ప్రాక్టీస్ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. లేకపోతే బెడిసి కొడుతుంది అంటున్నారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ జరగబోయే టి20 మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తోంది. ఇవాళ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 80 నుంచి 90% వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఇదే జరిగితే మ్యాచ్ కు అంతరాయం జరిగే ప్రమాదం ఉంది. అయితే వర్షం పడితే రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహించేలా ప్లాన్ కూడా చేస్తోందట ఐసీసీ.

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×