E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో.. బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..?

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో.. బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..?
Advertisement

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో శనివారం ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ లో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ఎక్కడ కూడా నిలబెట్టుకోకుండానే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిందన్నారు. ప్రజలు మాకు గుడి కట్టారంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయిందని మండిపడ్డారు.

సినిమా మిగిలే ఉంది..

తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్ని చోట్ల అష్టకష్టాలు పడిందని, కానీ ఈ ఎన్నికల్లో మాలాంటి న్యూ ప్లేయర్ ను ప్రజలు ఆదరించారన్నారు. త్వరలోనే మేము రాజకీయ పార్టీగా మారబోతున్నామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశామని, సమయం తక్కువగా ఉన్నప్పటికీ మా కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేశామన్నారు. ప్రజలు మమ్మల్ని 40 స్థానాల్లో గెలిపించారన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలే ఉందన్నారు. వడ్డెపల్లి లో మాకు క్లియర్ మాన్ డేట్ ను ప్రజలు కట్టబెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు ప్రలోభాలు పెట్టి వారిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Also Read: Nepali Gang Arrest: సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్‌లోని కి‘లేడీ’ అరెస్ట్..!

కాంగ్రెస్ కు 5 శాతం సీట్లు

నారాయణ్ పేట్ లో మాకు వైస్ ఛైర్మన్ ఆఫర్ చేస్తున్నారని, ఐతే దీనిపై లోకల్ నాయకత్వాన్నే నిర్ణయం తీసుకోమని చెప్పామన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల సమయంలో పట్టణాల్లో, మున్సిపల్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించిందన్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తమకు 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారని, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు 5 శాతం సీట్లు కూడా రాలేదని అంటున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానితో పోల్చుకుంటే బీఆర్ఎస్ చాలా స్థానాలు కోల్పోయిందన్నారు. రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం కుర్చీ లాక్కుంటా అని రాజ్ గోపాల్ రెడ్డి అంటున్నాడు. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలపై ముందు దృష్టి పెట్టాలని సూచించారు.

కారుకూతలు కూయకండి..

Advertisement

ఇక మేము రాజకీయ పార్టీగా వస్తామని అనగానే బీఆర్ఎస్ వాళ్లు ట్రోల్ చేయటం మొదలు పెట్టారని, వాళ్లకు ఏ సిర్ఫ్ ట్రైలర్ హై, పిక్చర్ బాకీ హై అని చెబుతున్నా.. ఇప్పుడే కారుకూతలు కూయకండి అని హెచ్చరించారు. ఉద్యమకారులను మంచి చేయాలని నేను మాట్లాడితే నా మీద ఇష్టమొచ్చినట్లు గా మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి అహంకారం తగ్గించుకొని ప్రజల మధ్యలో ఉండకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అన్నట్లుగా గా నార్త్ లో ఒకరికి ఒకరు సహకరించుకున్నారని మండిపడ్డారు.

Also Read: Netflix Top Web Series : క్రైమ్ నుంచి సైన్స్ ఫిక్షన్‌ సినిమాల వరకు… నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ వెబ్ సిరీస్‌ల లిస్ట్

సింగరేణి ఎన్నికల్లో..

కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే వారికి మద్దతు అని కేటీఆర్ చెప్పారని, గతంలో తోక పార్టీ అని చెప్పిన పార్టీకే ఇప్పుడు బీఆర్ఎస్ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. సాంబశివరావు కాళేశ్వరం విషయంలో అసెంబ్లీలో కేసీఆర్ పై ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఆ పార్టీకి మద్దతివ్వటమంటే కేసీఆర్ పై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అంగీకరించినట్లేఅన్నారు. పైగా సీపీఐ వాళ్లు కాంగ్రెస్ తో మిలాఖత్ అయి ఉన్నారని, అలాంటి వారికి బీఆర్ఎస్ మద్దతివ్వటమంటే నయవంచనే అన్నారు. కార్మికుల కోసం త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హెచ్ఎంఎస్, జాగృతి కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. కొత్త తరహా రాజకీయాలను జాగృతి చేసి చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపకుండా వదిలేయటంతోనే ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని స్పష్టం చేశారు.

కరీంనగర్‌లో బీజేపీ..

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ లోనూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి కలిసి పనిచేస్తాయన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీని కలిసే గెలుచుకున్నామన్నారు. కరీంనగర్ లో బీజేపీకి అసలు మెజార్టీ రాలేదని దాంతో మా పార్టీ వాళ్లకు కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్ వీ ఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Shikhamani: తిరుమల శ్రీవారికి అలంకరించే శిఖామణి గురించి తెలుసా..? ఇంకా ఏమేం అలంకరిస్తారంటే

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×