BigTV English

Surya kumar yadav wife : సూర్యకు ఇంట్లోనే శత్రువులు.. ఔట్ అయితే పెళ్ళామే నవ్వుతోంది భయ్యా

Surya kumar yadav wife : సూర్యకు ఇంట్లోనే శత్రువులు.. ఔట్ అయితే పెళ్ళామే నవ్వుతోంది భయ్యా

Surya kumar yadav wife : టీమిండియా క్రికెటర్ సూర్య కుమార్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. టీ-20ల్లో అతని కెప్టెన్సీలో గత ఏడాది ప్రపంచ కప్ సాధించింది టీమిండియా. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు సూర్య కుమార్. అయితే సూర్యకుమార్ ఔట్ కావడంతో సొంత పెళ్లామే నవ్వింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. సూర్య కుమార్ కి ఇంట్లోనే శత్రువులు ఉన్నారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read :  RCB VS PBKS: చిన్న స్వామి స్టేడియంలో కలకలం….మ్యాచ్ రద్దు ?

సూర్య కుమార్ భార్య ముందు భారీ పరుగులు చేయాలని భావించినప్పటికీ కమిన్స్ 26 పరుగుల వద్దనే సూర్యను ఔట్ చేశాడు. దీంతో సూర్య భార్య దేవిషా నవ్వింది. ఈ విషయం పై ఇప్పుడూ అంతా చర్చించుకోవడం విశేషం. సూర్య భార్య దేవిషా స్టేడియంలో ఉంటే పెద్దగా పరుగులు చేయడు అంటూ గతంలో రూమర్స్ వినిపించాయి. కానీ గతంలో గుజరాత్ టైటాన్స్ పై 49 బంతుల్లో 103 పరుగులు చేసి ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు. ప్రస్తుతం కూడా అలాంటి భారీ ఇన్నింగ్స్ ఒకటి ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సొంత భార్యనే నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


వాంఖడే స్టేడియంలో హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ లలో మూడో విజయాన్ని అందుకుని ప్లే ఆప్స్ రేస్ లో ఉంది. ముఖ్యంగా ముంబై తేలికగా విజయం సాధిస్తుందనుకుంటుడగా.. సూర్య కుమార్ యాదవ్, జాక్స్ ని కమిన్స్ స్వల్ప వ్యవధిలోనే ఔట్ చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ పని పూర్తి చేశారు.

Also Read : IPL 2025 playoffs: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఎలా.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి ?

సూర్య కుమార్ అద్భుతమైన ప్రదర్శన వెనుక అతని భార్య దేవిశా ప్రోత్సాహం కూడా ఉంది. అతని వ్యక్తిగత జీవితానికి వస్తే.. ముంబై డ్యాన్సర్ దేవిశాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె 2013 నుంచి 2015 వరు ది లైట్ హౌస్ ఎన్జీవో కోసం పని చేశారు. దేవిశా స్కూలింగ్ నుంచి ఉన్నత విద్య వరకు కూడా ముంబైలోని చదువుకున్నారు. ఎంబీఏలో గ్రాడ్యుయేషన్ చేవారు. మరోవైపు భర్త సూర్య పై ప్రేమతో సూర్య పేరిట మెడపై పచ్చబొట్టు కూడా వేసుకుంది. జులై 07, 2016న వీరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు అన్యోన్య దంపతులుగా కొనసాగుతున్నారు. కానీ వాంఖడే లో జరిగిన మ్యాచ్ లో  సూర్య ఔట్ కావడంతో దేవిశా నవ్వడం పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×