RCB VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament )భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల ( Royal Challengers Bangalore vs Punjab Kings teams ) మధ్య… 34వ మ్యాచ్ జరగనుంది. ఇక ఇవాల్టి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read : Dravid-Samson: రాజస్థాన్ లో పెను ప్రకంపనలు… సంజు శాంసన్ పై ద్రవిడ్ కుట్రలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్కు వర్షం అడ్డంకి
బెంగళూరు వేదికగా జరగబోతున్న RCB వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే వర్షం విపరీతంగా పడితే మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లు చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఒకవేళ వర్షం పడి ఆగిపోతే… మ్యాచ్ ఓవర్లు కుదించే ఛాన్స్ కూడా ఉంటుంది. లేదా డక్ వర్త్ లూస్ పద్ధతి ద్వారా మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే బెంగళూరు మ్యాచ్ కు.. వర్షం అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ నిరాశలో ఉన్నారు.
బెంగళూరు వర్సెస్ పంజాబ్ మధ్య రికార్డులు
రాయల్ చాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Pujab kings) మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 మ్యాచ్లలో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఏకంగా 17 మ్యాచ్లో విజయం సాధించడం… జరిగింది. అంటే పంజాబ్ కింగ్స్ జట్టు లీడింగ్ లో ఉందన్నమాట. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ జరుగబోయే మ్యాచ్ లో కోహ్లీ టీం కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read : IPL 2025 playoffs: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఎలా.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి ?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు VS పంజాబ్ కింగ్స్ జట్ల వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ XII: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ
పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ XII: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (సి), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (WK)/మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వేంద్ర సింగ్, అర్ష్‌దీప్ చాహల్/ విజయ్‌కుమార్ వై.