Badri4k : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్ లో అద్భుతమైన సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టి తెలుగు యూత్ ని అట్రాక్ట్ చేశాడు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమా మీద డెడికేషన్ తగ్గించాడు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకిచ్చే వ్యాల్యూ వేరు. ప్రతి సినిమా విషయంలోని పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతూ టెక్నికల్ గా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లేవాడు. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన సినిమా బద్రి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ కి ఎంత పెద్ద ప్లస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు తెలుగు సినిమాకి ఆటిట్యూడ్ అంటే ఇలా ఉంటది అని నేర్పించిన సినిమా బద్రి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.? కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ టైం వచ్చినట్లే ఉంది.
బద్రి రీ రిలీజ్
రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఒక ట్రెండ్ గా మారింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అలానే మహేష్ లిస్టులో కూడా విడుదల కావలసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇంకా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే తమ్ముడు, తొలిప్రేమ, జల్సా, గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ చాలామంది ఎదురుచూస్తున్న సినిమా బద్రి. ఆఖరికి ఖుషి సినిమా కూడా రీ రిలీజై బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తారీఖున బద్రి సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
బద్రి వెనుక కథ
బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. వాస్తవానికి బద్రి సినిమా వెనకాల చాలా కధ ఉంది. పవన్ కళ్యాణ్ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నాడు అని తెలిసి కెరియర్ స్టార్టింగ్ లో ఈయనతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాడు పూరి జగన్నాథ్. కానీ అప్పటికి పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా పూరి చూడలేదు. పవన్ కళ్యాణ్ కి కెమెరామెన్ చోటా కె నాయుడు మంచి స్నేహితుడు కావడంతో మొదట చోటా ఇంప్రెస్ అయ్యేలా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను చెప్పేసాడు. ఆ కథ నచ్చిన చోటా కే నాయుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పించారు. పవన్ కళ్యాణ్ కి బద్రి కథ చెప్పి ఇంప్రెస్ చేశాడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మార్చమంటే వారం రోజుల తర్వాత వెళ్లి మళ్లీ అదే క్లైమాక్స్ చెప్పాడు పూరి జగన్నాథ్. దానికి పవన్ కళ్యాణ్ మీ క్యారెక్టర్ ఏంటో టెస్ట్ చేయడానికి అలా చెప్పాను. మనం సినిమా చేస్తున్నామని మాటిచ్చి చేశాడు.
Also Read : Athiya Shetty – KLRahul : అతియా – కెఎల్ రాహుల్ కూతురు పేరు రీవిల్… అర్థం ఏంటో తెలుసా..?