BigTV English

AA22xA6 : అట్లీ , అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అప్పుడే ప్లాన్ చేస్తున్నారు

AA22xA6 : అట్లీ , అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అప్పుడే ప్లాన్ చేస్తున్నారు

AA22xA6 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీతో ఎదురుచూసే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మిగతా ఇండస్ట్రీలు చూసే పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది. చాలామంది మిగతా ఇండస్ట్రీ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదివరకే ప్రశాంత్ నీల్ ప్రభాస్, ఎన్టీఆర్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక ప్రస్తుతం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సాధించుకున్న అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.


వరుస సక్సెస్ సినిమాలు

అట్లీ విషయానికొస్తే రాజా రాణి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తలపతి విజయ్ హీరోగా సినిమాను చేశాడు. ఇక వరుసగా విజయ్ తో సినిమాలు చేసి మూడు సూపర్ హిట్ లు కొట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్లో షారుక్ ఖాన్ హీరోగా జవాన్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ఇక్కడితో అట్లీ రేంజ్ కూడా మారిపోయింది ఇక ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్లు. దానిలో అట్లీ రెమ్యూనరేషన్ దాదాపు 100 కోట్లని సమాచారం వినిపిస్తుంది. అల్లు అర్జున్ 175 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.


అప్పుడే రిలీజ్ ప్లానింగ్

ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ కు వెళ్లకముందే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను డిసెంబర్ 2026 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఫిలిం మేకర్స్ చెప్పిన డేట్ కి వస్తారు అని గ్యారెంటీ లేదు. షూటింగ్ జరుగుతున్న తరుణంలోని చిన్నగా హిట్ ఇస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఎంతవరకు మాట నిలబెట్టుకుంటారు వేచి చూడాలి. అట్లీతో సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.

Also Read : Badri4k : బద్రి రీ రిలీజ్ కి సిద్ధం, రికార్డులు గల్లంతు అంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×