BigTV English

IPL 2025 playoffs: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఎలా.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి ?

IPL 2025 playoffs: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఎలా.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి ?

IPL 2025 playoffs: ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను కాస్త నిరాశపరుస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 2 మ్యాచ్ లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల టేబుల్ లో 9 వ స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 7 మ్యాచ్ లు ఆడి.. రెండు మ్యాచ్ లు మాత్రమే విజయం సాధించడంతో ప్లే ఆప్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్లే ఆప్స్ కి వెళ్లాలంటే మిగతా 7 మ్యాచ్ లలో కచ్చితంగా 6 మ్యాచ్ ల్లో విజయం సాధించాల్సిందే. ఒకవేళ 5 మ్యాచ్ లలో మాత్రం గెలిస్తే.. మిగతా జట్ల కంటే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ రేట్ -1.217 గా ఉంది. మైనస్ లో ఉన్న రన్ నేట్ పాజిటివ్ లోకి రావాలంటే కొన్ని మ్యాచ్ లలో భారీ పరుగుల తేడాతో విజయం సాధిస్తేనే అది సాధ్యం అవుతుంది.


Also Read :  Klaasen: తప్పులో కాలేసిన కాటేరమ్మ కొడుకు… అసలు ఈ No – Ball రూల్స్ ఏంటి?

సన్ రైజర్స్ హైదరాబాద్ లో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఈ సీజన్ లో బౌలర్లు విఫలం చెందారనే చెప్పాలి. బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంటే గెలుపు సులుభతరమయ్యేది. కానీ ఉన్న బౌలర్లలో షమీ కాస్త ఫామ్ లో లేడనే చెప్పాలి. ముఖ్యంగా ముంబై తో జరిగిన మ్యాచ్ లో 3 ఓవర్లు వేసిన షమీ ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. అనవసరంగా భువనేశ్వర్ కుమార్ ని వదులుకున్నారని పలువురు అభిమానులు పేర్కొనడం గమనార్హం. గత సీజన్ వరకు SRH లో కీలక బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ కొనసాగాడు. భువనేశ్వర్ SRH తరపున అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు. ఇలాంటి కీలక ఆటగాడిని ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదని పలువులు కామెంట్స్ చేస్తున్నారు.


దీనికి తోడు బ్యాటింగ్ కూడా చేసినప్పుడు భారీ స్కోర్ చేస్తున్నారు. చేయనప్పుడు టకా టకా ఔట్ అయి వెనుదిరుగుతున్నారు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ సిక్స్ లు, ఫోర్లతో ఉప్పల్ స్టేడియంలో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. అయితే ప్రతిసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఎవ్వరికైనా కష్టమే. కానీ జట్టులో ఉన్న బ్యాట్స్ మెన్ లలో ఎవరో ఒకరూ రాణిస్తే.. జట్టు విజయాలకు చేరుతుంది. ఓవైపు బ్యాటింగ్ లో విఫలం.. మరోవైపు బౌలింగ్ లో కూడా విఫలం చెదడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో అసలు ప్లే ఆప్స్ కి వెళ్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ, క్లాసెన్, హెడ్ మినహా మిగతా ఆటగాళ్లందరూ విఫలం చెందారనే చెప్పవచ్చు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో అద్భుతంగా ఉన్న ముంబై జట్టు విజయం సులువు అయింది. మిగిలిన 7 మ్యాచ్ లలో సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని మ్యాచ్ లు కచ్చితంగా విజయం సాధిస్తేనే ప్లే ఆప్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. తరువాత జరుగబోయే మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చూపిస్తుందో వేచి చూడాలి మరీ.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×