E-Paper
Advertisement

Chain Snatching: బస్సులో పారిపోతుండగా సినిమా స్టైల్లో పట్టుకున్న పోలీసులు.. విలాసాల మోజులో వింత జంట!

Chain Snatching: బస్సులో పారిపోతుండగా సినిమా స్టైల్లో పట్టుకున్న పోలీసులు.. విలాసాల మోజులో వింత జంట!
Advertisement

Chain Snatching: జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ ఉదంతం చివరకు నిందితుల అరెస్టుతో ముగిసింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ఒక జంట పోలీసులకు చిక్కి ఇప్పుడు జైలు పాలయ్యారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితులు నరేంద్ర (23), రేవతి (33). వీరిద్దరి మధ్య పదేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. జల్సాల కోసం ఒకటయ్యారు. సనత్ నగర్ ప్రాంతంలో నివసించే వీరిద్దరూ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం.. మాదాపూర్‌లోని హాస్టల్ నుండి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39లోని తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మానసను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఈ సాహసానికి ఒడిగట్టడం గమనార్హం.

Advertisement

నరేంద్ర యాక్టివా బైక్ నడుపుతుండగా.. వెనుక కూర్చున్న రేవతి మానస మెడలోని బంగారు గొలుసును లాగేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు , టాస్క్‌ఫోర్స్ బృందాలు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాయి. నిందితులు వాడిన యాక్టివా బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నరేంద్ర ఒక ర్యాపిడో డ్రైవర్‌గా గుర్తించారు. అతని ఫోన్ సిగ్నల్స్ , కదలికలను ట్రాక్ చేస్తూ పోలీసులు వేట ప్రారంభించారు.

నేరం చేసిన తర్వాత దొరక్కుండా ఉండేందుకు వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వగ్రామాలకు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే.. సూర్యాపేట సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వీరిని పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమ విలాసాల కోసం, జల్సాల కోసమే ఈ స్నాచింగ్‌కు పాల్పడినట్లు వారు అంగీకరించారు. ప్రస్తుతం వీరిద్దరిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Also Read: శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×