E-Paper
Advertisement

Scotland vs Italy: ఇట‌లీ చిత్తు.. బంగ్లాదేశ్ స్థానంలో వ‌చ్చిన స్కాట్కాండ్ భారీ విజ‌యం, మొనగాళ్లంటే వీళ్లేరా

Scotland vs Italy: ఇట‌లీ చిత్తు.. బంగ్లాదేశ్ స్థానంలో వ‌చ్చిన స్కాట్కాండ్ భారీ విజ‌యం, మొనగాళ్లంటే వీళ్లేరా
Advertisement

Scotland vs Italy:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20I World Cup 2026) ప్రారంభమైన నేపథ్యంలో మ్యాచ్ లు అన్ని చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. పసికూన జట్లు విజృంభించి పంజా విసురుతున్నాయి. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు చిన్న జట్లు. ఇప్పటికే నేపాల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెదర్లాండ్స్ లాంటి జట్లు అదరగొట్టాయి. లేటెస్ట్ గా బంగ్లాదేశ్ స్థానంలో చివరి క్షణంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లోకి వచ్చిన స్కాట్లాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టి20 ప్ర‌పంచ క‌ప్‌ లో 200కు పైగా పరుగులు చేయడమే కాకుండా, ఈ టోర్నమెంటులో ఫస్ట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇటలీ జటుపై ( Italy) ఏకంగా 73 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది స్కాట్లాండ్ ( Scotland ). దీంతో బంగ్లాదేశ్ పరువు తీస్తున్నారు ఇండియన్ ఫాన్స్. సెక్యూరిటీ లేదని ఇండియాకు రాకుండా పారిపోయిన బంగ్లాదేశ్ జట్టుకు ఇకనైనా సిగ్గు రావాలని… స్కాట్లాండ్ లాంటి జట్లను చూసి నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు ఇండియన్ ఫాన్స్.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

బంగ్లాదేశ్ స్థానంలో వ‌చ్చిన స్కాట్కాండ్ భారీ విజ‌యం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20I World Cup 2026)  భాగంగా ఇవాళ స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చివరి క్షణంలో టోర్నమెంట్ లోకి వచ్చిన స్కాట్లాండ్ విజయం సాధించింది. ఇటలీపై 73 పరుగులతో దుమ్ము లేపింది స్కాట్లాండ్ జట్టు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసింది స్కాట్లాండ్. ఈ సందర్భంగా 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది స్కాట్లాండ్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇటలీ అట్టర్ ఫ్లాప్ అయింది. 16.4 ఓవర్లు ఆడిన ఇటలీ 134 పరుగులు చేసి ఆలవుటైంది.

దీంతో స్కాట్లాండ్ ఈ టోర్నమెంట్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ టోర్నమెంట్ ( T20I World Cup 2026)  సందర్భంగా స్కాట్లాండ్ చివరి క్షణంలో స్థానం సంపాదించుకుంది. బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగింది. ఇండియాలో సేఫ్టీ లేదని కారణాలు చూపిస్తూ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20I World Cup 2026)  బహిష్కరించింది బంగ్లాదేశ్ ( Bangladesh Team). ఐసీసీ ( ICC) ఎంత చెప్పినా కూడా వినకుండా పోకడలకు పోయింది బంగ్లాదేశ్. దీంతో బంగ్లాదేశ్ జట్టును తొలగించి వెంటనే స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది ఐసీసీ. ఇక ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకున్న స్కాట్లాండ్ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు ఇండియన్ ఫ్యాన్స్ కూడా దారుణంగా బంగ్లాదేశ్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×