E-Paper
Advertisement

Baba Vanga Prediction: బంగారం, వెండి ధరలపై.. బాబా వంగా జోస్యం.. 2026లో ఆభరణాలు కొనలేమా?

Baba Vanga Prediction: బంగారం, వెండి ధరలపై.. బాబా వంగా జోస్యం.. 2026లో ఆభరణాలు కొనలేమా?
Advertisement

Baba Vanga Prediction: బాబా వంగా జోస్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎల్లప్పుడూ బజ్ కొనసాగుతూనే ఉంటుంది. బల్గేరియాకు చెందిన ఈ ప్రపంచ ప్రసిద్ధ జ్యోతిష్కురాలు చెప్పిన భవిష్యవాణి.. ఇప్పటివరకూ చాలా సందర్భాల్లో నిజమవుతూ వచ్చాయి. ఆమె ప్రిడిక్ట్ చేసినట్లుగానే సోవియట్ యూనియన్ పతనం, సెప్టెంబర్ 11 దాడులు, యువరాణి డయానా మరణం, 2004 సునామీ, కరోనా మహమ్మారి వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రస్తుతం తీవ్రస్థాయిలో ఒడిదొడుకలుకు గురవుతున్న బంగారం, వెండి గురించి సైతం ఆమె గతంలోనే ఓ జోస్యం చెప్పారు. 2026లో ఆమె చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.

బంగారం, వెండిపై వంగా జోస్యం..!

బాబా వంగా ప్రకారం.. 2026లో ప్రపంచ వ్యాప్తంగా కరెన్సీ విలువ పతనావస్థకు చేరుకుంటుంది. ఫలితంగా నగదు (డాలర్స్ కొనుగోళ్లు) ఆధారిత పొదుపులపై పెట్టుబడిదారుల ఆసక్తి సన్నగిల్లిపోతుంది. నగదు స్థానంలో బంగారం, వెండి, రాగి వంటి వస్తువులపై తమ పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని వ్యాపారులు భావిస్తారని వంగా జోస్యం చెప్పారు. దీంతో లోహాల ధరలు గతంతో పోలిస్తే తారా స్థాయికి చేరుకొని.. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో విడుదలైన కొన్ని ఆర్థిక నివేదికలను పరిశీలిస్తే.. బాబా వంగా చెప్పినట్లే జరుగుతోందని చాలా మంది విశ్వసిస్తున్నారు. ట్రంప్ ప్రతీకార సుంకాలు, అమెరికా – ఇరాన్, రష్యా – ఉక్రెయిన్, అమెరికా – ఈయూ దేశాల మధ్య ఉద్రిక్తలు.. ఆర్థిక సంక్షోభానికి ఊతం ఇస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వంగా అంచనాలు నిజమవుతోందా?

Advertisement

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని స్థాయిలో పెరుగుతుండటం తెలిసిందే. అయితే దీనిని బాబా వంగా జోస్యంతో కొందరు ముడిపెడుతున్నారు. ఆమె చెప్పినట్లుగానే పెట్టుబడిదారులు లోహాలపై తమ దృష్టి కేంద్రీకరించారని పేర్కొంటున్నారు. 2026 చివరినాటికి బంగారం ధరలు మరింత గరిష్టానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మరికొందరు వంగా అంచనాలను తిప్పికొడుతున్నారు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి, బలమైన పారిశ్రామిక డిమాండ్ కారణంగానే బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండటం సామాన్యుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. భవిష్యత్తులో బంగారం కొనగలమా? అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

Also Read: Trending Mobiles India Feb 2026: శాంసంగ్ నుంచి ఐఫోన్ వరకు.. ఈ నెలలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న కొత్త ఫోన్స్!

మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..

Advertisement

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,240 పెరిగింది. 22 క్యారెట్ల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే రూ.2,050 మేర ప్రియం అయ్యింది. ప్రస్తుతం మార్కెట్ లో 10 గ్రాముల 24K గోల్డ్ రూ.1,58,480 పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి (10 గ్రాములు) రూ. 1,16,480కు విక్రయిస్తున్నారు. మరోవైపు వెండి సైతం ఇవాళ కేజీకి ఏకంగా రూ.15000 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి రూ.3 లక్షలు పలుకుతోంది.

Also Read: Bengaluru Crime: ఛీ.. ఛీ.. ఇదేం కూతురు.. ఏకంగా తల్లి ఫోటోలు ప్రియుడికి పంపి, ఆ తర్వాత

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×