Tanveer Ahmed: ఒక పక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) కొనసాగుతుంటే.. మరో పక్క బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 1st Test) మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఢాకాలోని షేర్ బంగ్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Shere Bangla National Stadium, Dhaka) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఈ తొలి టెస్ట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇవాళ ఈ మ్యాచ్ లో నేడు చివరి రోజు కాగా, మరో 137 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ విజయం సాధించనుంది. లేకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్రీమియం బౌలర్ షాహీన్ అఫ్రిది పై (Shaheen Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్ (Tanveer ahmed). ఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్ పరువు తీస్తున్న షాహీన్.. బాల్ టాంపరింగ్ కు (Ball Tampering) శ్రీకారం చుట్టడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ (Bangladesh vs Pakistan, 1st Test) జరుగుతున్న సందర్భంగా షాహీన్ అఫ్రిది సరికొత్త వివాదానికి తెర లేపాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బౌలింగ్ చేసిన ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది… తన షూ లతో బాల్ టాంపరింగ్ చేసే ప్రయత్నం చేశాడు. తన దగ్గరకు వచ్చిన బంతిని కాళ్లతో గట్టిగా తొక్కాడు. అయితే ఈ సంఘటనను వెంటనే గమనించిన అంపైర్లు, షాహీన్ అఫ్రిదిని మందలించి, అతని నుంచి బంతి తీసుకున్నారు. అయితే బాల్ టాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించినా కూడా.. బంతి షేప్ మారలేదు.
దీంతో ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) బతికి బయటపడ్డాడు. లేకుంటే ఐసీసీ ( ICC) ఇప్పటికే యాక్షన్ తీసుకునేది. అయితే ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది చేసిన ఈ పనిపై తన్వీర్ అహ్మద్ చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి వెధవల వల్ల పాకిస్తాన్ పరువు గంగలో కలుస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇలాగే బాల్ టాంపరింగ్ పాల్పడినట్లు గుర్తు చేశారు. అక్కడ వదిలేసినా, ఇప్పుడు మాత్రం ఐసిసి చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల క్రికెట్ అభిమానులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిపై స్పందించి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారు.
Another Pakistani caught tampering the ball
Weeks after Fakhar Zaman was penalised for ball tampering during the PSL, now Shaheen Shah Afridi has come under the scanner after cameras caught him seemingly trying to alter the shape of the ball during the Test against Bangladesh… pic.twitter.com/iGOF51XPBb
— Brutal Truth (@sarkarstix) May 11, 2026