E-Paper
Advertisement

Tanveer Ahmed: బ్యాట్ల‌లో స్ప్రింగులు పెట్టి రజత్ ఆడాడు..బాబ‌ర్ కాలిగోటికి కూడా సరిపోడు

Tanveer Ahmed: బ్యాట్ల‌లో స్ప్రింగులు పెట్టి రజత్ ఆడాడు..బాబ‌ర్ కాలిగోటికి కూడా సరిపోడు
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Royal Challengers Bengaluru vs Gujarat Titans) మధ్య క్వాలిఫైయర్ తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 92 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు ఐపీఎల్ 2026 ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది బెంగుళూరు. అయితే ఈ మ్యాచ్ లో ఒంటరి పోరాటం చేసిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. బ్యాటులో స్ప్రింగ్ పెట్టి ఆడాడని ఆరోపణలు చేశారు. అందుకే ఇంత భయంకరంగా రజత్ పాటిదార్ బ్యాటింగ్ చేసినట్లు సంచలన విషయాలను పంచుకున్నారు. దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

బ్యాట్ల‌లో స్ప్రింగులు పెట్టి రజత్ పాటిదార్ ఆడాడు

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ కు ధర్మశాల వేదిక అయింది. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 254 పరుగులు సాధించింది. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ 33 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు, ఐదు బౌండర్లు ఉన్నాయి. 281.82 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్ధులకు నరకం స్పెల్లింగ్ రాయించాడు. గ్రౌండ్ లో అన్ని వైపులా భారీ షాట్స్ ఆడాడు. దీంతో AB డివిలియర్స్ తో రజత్ పాటిదార్ ను పోల్చుతున్నారు. అయితే అందరూ అతన్ని మెచ్చుకుంటే.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మాత్రం విషం కక్కాడు. నిన్నటి మ్యాచ్ సందర్భంగా బ్యాటులో స్ప్రింగులు పెట్టుకొని రజత్ పాటిదార్ బరిలోకి దిగాడని ఆరోపణలు చేశారు.

అందుకే అంత భయంకరంగా బ్యాటింగ్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు తన్వీర్ అహ్మద్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటేనే చీటింగ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐపిఎల్ టోర్నమెంట్ లో మాత్రమే స్ప్రింగులు, చిప్స్ పెట్టి బ్యాటింగ్ చేస్తూ ఉంటారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా పాకిస్తాన్ ఆటగాళ్ల ముందు దేనికి పనికిరారని బాంబు పేల్చారు. నిన్నటి నుంచి రజత్ పాటిదార్ గురించి డబ్బా కొట్టుకుంటున్నారు.. కానీ అతడు బాబర్ ఆజం (babar azam) కాలిగోటికి కూడా సరిపోడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజత్ పాటిదార్ (Rajat Patidar) లాంటి ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రాకుండా తాను చూస్తానని శపథం చేశారు. ఇలాంటి వాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వస్తే, పాకిస్తాన్ పరువు పోతుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×