E-Paper
Advertisement

మ‌ళ్లీ ఐపీఎల్ పిల్ల బ‌చ్చాల‌తోనే ఆడుతున్నారు..జింబాబ్వేతోనూ ఓట‌మి ఖాయం

మ‌ళ్లీ ఐపీఎల్ పిల్ల బ‌చ్చాల‌తోనే ఆడుతున్నారు..జింబాబ్వేతోనూ ఓట‌మి ఖాయం
Advertisement

Tanveer Ahmed Reaction On IND VS ZIM:  టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe vs India) మధ్య నేటి నుంచి టి20 సిరీస్ ( India tour of Zimbabwe 2026) ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 3 టీ20 లు జరగనున్నాయి. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో ఇప్పటికే వైట్ వాష్ అయిన టీమిండియా.. పసికూన జింబాబ్వేతో యుద్ధానికి సిద్ధమైంది. ఇలాంటి క్రమంలో టీం ఇండియాను హేళన చేస్తూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ‌ళ్లీ ఐపీఎల్ పిల్ల బ‌చ్చాల‌తోనే ఆడుతున్నారని… ఈ త‌రుణంలోనే జింబాబ్వేతోనూ టీమిండియా ఓడిపోవ‌డం ఖాయం అంటూ చుర‌క‌లు అంటించారు. ఐపీఎల్ ను న‌మ్ముకుంటే, ప్ర‌తీ సిరీస్ లోనూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

పిల్ల బ‌చ్చాల‌తోనే ఆడుతున్నారు..జింబాబ్వేతోనూ ఓట‌మి ఖాయం

Advertisement

ఇండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe vs India)  మధ్య జరగనున్న టీ20 సిరీస్ నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో ఓడిపోయినట్లుగానే… జింబాబ్వే చేతిలో కూడా టీమిండియా ఓడిపోతుందని జోష్యం చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడిన కుర్రాళ్లతోనే మళ్లీ టీమిండియా బరిలోకి దిగుతోందని హేళన చేశారు. దీనివల్ల టీమిండియా కు పెద్దగా కలిసి రాబోదని పరువు తీశారు. ఐపీఎల్ లో హైవే లాంటి మైదానాలలో ఆడిన కుర్రాళ్ళు.. జింబాబ్వేలో తడబడతారని హెచ్చరించారు. గత ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

ఇలాంటి నేపథ్యంలో.. జింబాబ్వే కూడా టీం ఇండియాను క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. ఇక 15 ఏళ్ల కుర్రాడు వైభ‌వ్ సూర్య‌వంశీని న‌మ్ముకుని, బీసీసీఐ ఏదో చేస్తామ‌ని రెచ్చిపోతోంద‌ని ఆగ్ర‌హించారు. కానీ వాడి వల్ల ఏమీ కాద‌ని ప‌రువు తీశారు. 15 ఏళ్ల వైభవ్… ఇప్పటికే ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమయ్యాడని హేళన చేశారు. తన వయసు కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయాడని బాంబు పేల్చాడు. ఈ జింబాబ్వే టూర్ లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని సెటైర్లు పేల్చాడు. అనవసరంగా వైభవ్ సూర్యవంశీని నమ్ముకుని వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను పక్కకు పెట్టడం దారుణం అన్నారు.

జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ టైమింగ్స్

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరగనున్న టి20 సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. పాన్ కోడ్, దూర‌ద‌ర్శ‌న్‌, యునైట్ 8 స్పోర్ట్స్‌ లో ఈ మ్యాచ్ ప్రసారాలు వస్తాయి.

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

 

 

Related News

టీమిండియా క్రికెట‌ర్లు కాకుండా, వాళ్ల భార్య‌లే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ?

Kavya Maran: నా డ‌బ్బు, నా ఇష్టం..ఎవ‌రినైనా కొనేస్తా?

మ‌ళ్లీ తెర‌పైకి షేక్ హ్యాండ్ వివాదం…మా కాళ్ల ద‌గ్గ‌ర‌కు బీసీసీఐ వ‌చ్చిందంటూ ఓవరాక్ష‌న్

గొడ‌వ‌లు మ‌ర్చిపోయి, మాతో టెస్ట్ సిరీస్ ఆడండి..బీసీసీఐని కోరిన న‌ఖ్వీ

పాకిస్తాన్ క్రికెట్ లో వాస్తు దోషం..PCB ఆఫీస్ మార్చాలంటూ ఆదేశాలు

పొద్దున లేస్తే.. రాముడిని, మోదీని తిడ‌తారా? ఇవేం దిక్కుమాలిన నిర‌స‌న‌లు !

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

Big Stories

Advertisement
×