E-Paper
Advertisement

Tanveer Ahmed: అంతా ఫిక్సింగే..జింబాబ్వేకు జై షా డ‌బ్బులు..అందుకే టీమిండియా విజ‌యం, మ‌రోసారి విషం క‌క్కిన పాక్‌

Tanveer Ahmed: అంతా ఫిక్సింగే..జింబాబ్వేకు జై షా డ‌బ్బులు..అందుకే టీమిండియా విజ‌యం, మ‌రోసారి విషం క‌క్కిన పాక్‌
Advertisement

Tanveer Ahmed:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs Zimbabwe) మధ్య గురువారం సూపర్ 8 మ్యాచ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి 72 ప‌రుగుల‌తో తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. సెమీ ఫైనల్ వెళ్లే రూట్స్ కూడా క్లియర్ చేసుకుంది టీమిండియా. వెస్టిండీస్ పైన విజయం సాధిస్తే టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు వెళుతుంది. అయితే టీమిండియా, నిన్న జింబాబ్వే పైన గ్రాండ్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. టీమిండియా విజయం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని… జింబాబ్వేకు డబ్బులు ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ డబ్బులు తీసుకొని జింబాబ్వే కావాలని ఓడిపోయిందని ఆరోపణలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

అంతా ఫిక్సింగే..జింబాబ్వేకు జై షా డ‌బ్బులు

Advertisement

టీమ్ ఇడియా వర్సెస్ జింబాబ్వే మధ్య గురువారం చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదికగా సూపర్ 8 మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ చెన్నై లో జరిగిన నేపథ్యంలో ఐసీసీ బాస్ జై షా ( jay shah) హాజరయ్యారు. స్టేడియంలోని ప్రత్యేక గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ తిలకించారు. ఐసీసీ బాస్ జై షాతో పాటు తమిళ స్టార్ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ ( Anirudh Ravichander) కూడా ఉన్నారు. అయితే జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ సందర్భంగా జై షా ( ICC Chairman Jay Shah) మెరవడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

టీమిండియాను గెలిపించేందుకు స్టేడియానికి ఐసీసీ బాస్ జై షా వచ్చాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టేడియానికి వచ్చిన అనంతరం జింబాబ్వేకు జై షా డబ్బులు కూడా ఇచ్చాడని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా చేతిలో జింబాబ్వే చిత్తుగా ఓడిపోయిందని, ఈ మ్యాచ్ మొత్తం ఫిక్సింగ్ జరిగినట్లు పేర్కొన్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. మార్చి ఒకటవ తేదీన వెస్టిండీస్ పైన కూడా టీమిండియా గెలిచేలా ప్లాన్ చేయబోతున్నారని.. మరో బాంబు పేల్చారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనికి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు ఆడడం చేతకాదని… ఇలా ఆరోపణలు చేయమంటే నోటికి వచ్చింది వాగుతారని ఫైర్ అవుతున్నారు.

Advertisement

Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

 

 

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×