E-Paper
Advertisement

Malayalam Thriller OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ థ్రిల్లర్… వరుస హత్యలతో వణికించే స్టోరీ

Malayalam Thriller OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ థ్రిల్లర్… వరుస హత్యలతో వణికించే స్టోరీ
Advertisement

Malayalam Thriller OTT : మరో మలయాళ థ్రిల్లర్ త్వరలో ఆన్‌లైన్‌లో చూడటానికి అందుబాటులోకి రానుంది. గత ఏడాది డిసెంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, దాదాపు మూడు నెలల తరువాత డిజిటల్ ఆడియన్స్ ను పలకరించబోతోంది. ఇంద్రజిత్ సుకుమారన్ పోలీసు పాత్రలో నటించిన ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్ వేట చుట్టూ తిరుగుతుంది. భారీ యాక్షన్ సీన్లు, క్రైమ్ సస్పెన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దీని స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. గ్రిప్పింగ్ కథాంశంతో నడిచే ఈ సినిమా ఏ ఓటీటీలోకి ఎప్పుడు రానుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

జితిన్ సురేష్ టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పేరు ‘ధీరం’ (Dheeram). ప్రధాన పాత్ర పోషించిన ఇంద్రజిత్ సుకుమారన్‌తో పాటు అజు వర్గీస్, దివ్య పిళ్లై, విజయరాఘవన్, నిశాంత్ సాగర్, పానీ-ఫేమ్ సాగర్ సూర్య, రెబా మోనికా జాన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు ఇందులో. ఈ సినిమా స్క్రిప్ట్‌ను సందీప్ సందానందన్, దీపు ఎస్. నాయర్ కలిసి రాశారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది. కలాంకావల్‌తో సహా మరో మూడు మలయాళ చిత్రాలతో ఏకకాలంలో విడుదలైనందున , ధీరం థియేటర్లలో అంతగా విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఈ సినీమా ప్రేక్షకులు కలవరపెట్టే మంచి థ్రిల్లర్‌గా ప్రశంసలు అందుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కొచ్చి నగరంలో వరుసగా జరుగుతున్న దారుణమైన హత్యల నేపథ్యంలో ‘ధీరం’ కథ సాగుతుంది. ఈ కేసును ఛేదించడానికి ఏసీపీ స్టాలిన్ జోసెఫ్ (ఇంద్రజిత్ సుకుమారన్) రంగంలోకి దిగుతాడు. హంతకుడు చాలా తెలివిగా, ఎక్కడా ఆధారాలు దొరకకుండా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా, ఈ హత్యల వెనుక ఒక భయంకరమైన పగ ఉందని, చనిపోయిన వారంతా గతంలో ఒక తప్పు చేసిన వాళ్లేనని స్టాలిన్ గుర్తిస్తాడు. హంతకుడిని పట్టుకునే క్రమంలో స్టాలిన్ కి అనేక చేదు నిజాలు తెలుస్తాయి. చట్టం శిక్షించలేని నేరస్థులను ఒక సామాన్యుడు తన చేతులతో ఎలా శిక్షించాడనేది ఇక్కడ ఉత్కంఠ కలిగిస్తుంది. అయితే హంతకుడిని జోసెఫ్ పట్టుకుంటాడా ? అసలు కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అతనికి జరిగిన అన్యాయం ఏమిటి ? అనే విషయాలను ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే.

Read Also : పూల తోటలో మృతదేహాలు… ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా… ఈ ఆరు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ భీభత్సమే

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×