Tanveer Ahmed On Salman Ali Agha Century: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో సల్మాన్ అలీ అఘా అదిరిపోయే సెంచరీ నమోదు చేశారు. 90 బంతులు ఎదుర్కొన్న సల్మాన్ అలీ అఘా.. 107 పరుగులు చేసి రఫాడించాడు. 118 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టిన సల్మాన్ అలీ అఘా… 10 బౌండరీలతో పాటు ఓ సిక్సర్ కూడా నమోదు చేశాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత సల్మాన్ అలీ అఘా తన కంటి దగ్గర వేలు పెట్టుకొని, ఎవరికో వార్నింగ్స్ ఇస్తున్నట్టుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
అయితే దీనిపై తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. టి20 కెప్టెన్సీ తొలగించిన పాకిస్తాన్ క్రికెట్ పెద్దలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే క్రమంలో సల్మాన్ అలీ అఘా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నాడని తెలిపారు. ముఖ్యంగా మొహ్సిన్ నఖ్వీకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేందుకు ఇలా డిఫరెంట్ గా సల్మాన్ ప్లాన్ చేసి ఉంటాడంటూ తన్వీర్ రియాక్ట్ అయ్యారు. సల్మాన్ అలీ అఘా దెబ్బకు నఖ్వీ గాడి రెండు చెంపలు వాచిపోయింటాయ్ అంటూ కూడా కామెంట్ చేశారు. దీంతో సల్మాన్ అలీ అఘా సెంచరీ సెలబ్రేషన్స్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సెంచరీ చేసిన తర్వాత తనకు కొత్త జోష్ వచ్చినట్టు అనిపించిందని సల్మాన్ అలీ వెల్లడించారు. ఈ సెలబ్రేషన్ కేవలం తన కొడుకు కోసం మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎవరినో కించ పరిచేందుకు ఆ సెలబ్రేషన్స్ చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. సెలక్టర్లు తీసుకునే నిర్ణయాలు అందరూ గౌరవించాల్సిందేనని తెలిపారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని… పాకిస్తాన్ తరఫున ఆడటం కోసం ఏదైనా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. తన కొడుకు టీవీలలో మ్యాచ్ లు చూస్తాడు కాబట్టి భిన్నంగా సెలబ్రేషన్స్ చేసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు సల్మాన్ అలీ.
శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య ఆదివారం రోజున వన్డే సిరీస్ షురూ అయింది. ఈ వన్డే ట్రై సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 305 పరుగులు సాధించి ఆల్ అవుట్ అయింది. ఇందులో సల్మాన్ అలీ సెంచరీతో దుమ్ము లేపాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో లంక తేలిపోయింది. 48.1 ఓవర్లు ఆడిన శ్రీలంక 268 పరుగులు చేసి కుప్పకూలింది. ఈ క్రమంలో 37 పరుగుల తేడాతో శ్రీలంక పై పాకిస్తాన్ విక్టరీ అందుకుంది.